Vishal: మీ కాళ్లు మొక్కుతాను.. దయచేసి రాజకీయం చేయకండి.. వైఎస్ఆర్ కి నా సెల్యూట్..

తమిళ స్టార్ హీరో విశాల్ కేవలం హీరోగా మాత్రమే కాదు తనచుట్టూ జరిగే సమస్యల గురించి కూడా స్పందిస్తూ (Vishal)ఉంటాడు. ఎలాంటి సమస్య అయిన సరే అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో కృషి చేస్తూ ఉంటాడు.

Vishal: మీ కాళ్లు మొక్కుతాను.. దయచేసి రాజకీయం చేయకండి.. వైఎస్ఆర్ కి నా సెల్యూట్..

Hero Vishal makes sensational post on social media regarding Coimbatore rape incident

Updated On : November 8, 2025 / 3:53 PM IST

Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ కేవలం హీరోగా మాత్రమే కాదు తనచుట్టూ జరిగే సమస్యల(Vishal) గురించి కూడా స్పందిస్తూ ఉంటాడు. ఎలాంటి సమస్య అయిన సరే అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో కృషి చేస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి మరో సమస్యపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇటీవల కోయంబత్తూర్ లో అత్యాచార ఘటన జరిగిన విషయం తెలిసిందే. కళాశాల విద్యార్థినిపై కొంతమంది సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

Kamakshi Bhaskarla: కామాక్షి వింత అలవాటు: ప్రశాంతత కోసం స్మశానానికి వెళుతుందట.. అక్కడికి వెళ్లి..

ఘటన జరిగిన సమయంలో బాధితురాలు అక్కడ ఉన్నందుకు ఆమెను నిందించడం దయచేసి సరైనది కాదు. మన దేశంలో పునరావృతమవుతూనే ఉన్న ఇకముందు కూడా అయ్యే ఈ రక్తసిక్తమైన అత్యాచారం అనే సమస్యలను రాజకీయం చేయడం దయచేసి ఆపేయండి. మీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుతాను. ఈ దారుణమైన చర్యకు పాల్పడ్డ వారికి ఉరిశిక్ష అమలు చేయండి. నిర్భయ ఘటన చూశాం.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి సొంత తల్లిని హత్య చేసిన నిందితుడు నిర్దోషిగా రిలీజ్ కావడం కూడా మనం చూశాం. ఇదే ఘటన సౌదీ అరేబియాలో జరిగితే ఈపాటికే చంపేశారు.

కానీ, మన దేశంలో మాత్రం నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి నేరం జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేను సెల్యూట్ చేస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన మకుటం అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. స్వయంగా ఆయనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.