AR Rahman: అవార్డులు ఎన్నుంటే ఏం లాభం.. రెహమాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అవార్డులపై మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Peddi music director AR Rahman Makes Shocking Comments About Awards

  • అవార్డులపై రెహమాన్ కామెంట్స్
  • పాతవి చూసి మురుపోవడం కాదు
  • ఈరోజు ఏం చేశామనేది చూడాలి

AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 4న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పెద్ది సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను దర్శకుడు పంచుకున్నారు.

Ram Charan: రామ్ చరణ్ ‘ఒంగోలు గిత్త’.. నటనతోనే పోటీపడ్డాడు.. ట్రెండ్ అవుతున్న బ్రహ్మానందం కామెంట్స్

దుబాయ్‌లో తెల్లవారుజామున ఐదున్నర గంటలకే లేచి ఒంటరిగా సంగీత సాధన చేస్తున్న ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని బుచ్చిబాబు పేర్కొన్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మేషన్, రెహమాన్ అంకితభావం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని ఆయన ఎమోషనల్‌గా వివరించారు. ఈ వయసులో కూడా అంతటి క్రమశిక్షణతో పని చేయడం కేవలం రెహమాన్‌కే సాధ్యమంటూ దర్శకుడు కొనియాడారు.

బుచ్చిబాబు ప్రశంసలపై స్పందించిన రెహమాన్ (AR Rahman)సినీ పరిశ్రమ ప్రవహించే నీరు లాంటిదని, ఇక్కడ ఎప్పుడూ కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుందని అన్నారు. గతంలో వచ్చిన పాత అవార్డులను చూసుకుని మురిసిపోవడం కాకుండా, ‘ఈ రోజు ఏం చేశాం’ అనేదే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకులు యూట్యూబ్‌లో ప్రతి సెకన్ సౌండ్‌ను నిశితంగా గమనిస్తున్నారని, పాటలో వచ్చే చిన్న హమ్మింగ్ బిట్‌ను సైతం కట్ చేసి వింటున్నారని చెప్పారు. ఆడియన్స్ ఆలోచనా విధానం ఇంతలా మారినందుకే తాను నిరంతరం అప్‌డేట్ అవుతూ బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి శ్రమిస్తున్నట్లు రెహమాన్ వివరించారు.