Vichithra : నటి విచిత్రకి వేధింపులు.. ఆ హీరో గురించి బిగ్‌బాస్‌లో కమల్ మాట్లాడతారా?

తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ నటి విచిత్ర తాను ఓ ప్రముఖ హీరో నుంచి వేధింపులు ఎదుర్కున్నానంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాబోయే శని,ఆదివారం ఎపిసోడ్స్‌లో కమల్ హాసన్ స్పందిస్తారా? లేక దాటవేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

Vichithra : నటి విచిత్రకి వేధింపులు.. ఆ హీరో గురించి బిగ్‌బాస్‌లో కమల్ మాట్లాడతారా?

Vichithra

Vichithra : తమిళనాట బిగ్‌బాస్ 7 వ సీజన్ జరుగుతోంది. టాస్క్‌లో భాగంగా నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఓ ప్రముఖ తెలుగు హీరో వల్ల తను క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసానని.. అతని వల్లే సినిమాలకు గుడ్ బై చెప్పానని విచిత్ర చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ శని, ఆదివారాలు జరిగే ఎపిసోడ్‌లో మాట్లాడే సాహసం చేస్తారా? అసలు విషయాలు చెప్పించేందుకు ప్రయత్నిస్తారా? ఈ వారం తమిళ బిగ్ బాస్ ఉత్కంఠగా మారబోతోంది.

కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో దూసుకుపోతున్న కంటెస్టెంట్స్‌లో నటి విచిత్ర కూడా ఉన్నారు. ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్లకు తమ జీవితంలో ఎదురైన మలుపు గురించి మాట్లాడాల్సిన టాస్క్ ఇచ్చారు. ఆ సమయంలో విచిత్ర తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని అదీ తెలుగు సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో 20 సంవత్సరాల క్రితం ఎదుర్కున్నానంటూ బయట పెట్టారు. ఆ ఘటన వల్లే తాను సినిమాలకు దూరంగా ఉన్నానని విచిత్ర చెప్పడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై యూనియన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.

Naga Vamsi : ‘గుంటూరు కారం’కు ఎలాంటి రివ్యూలు ఇచ్చిన పర్లేదు.. సినిమా బ్లాక్ బస్టర్.. మరోసారి రివ్యూల గురించి చర్చ..

2000 సంవత్సరంలో ఓ తెలుగు సినిమా చేస్తున్న టైమ్‌లో ఓ ఫేమస్ హీరో తనను తన గదికి రావాలని పిలిచాడని తను వెళ్లకపోవడంతో అతను కోపగించుకున్నాడని విచిత్ర చెప్పారు. ఆ తర్వాత ఆ హీరో తాగి తన రూమ్ తలుపులు కొట్టేవాడని.. అడవిలో షూటింగ్ అవుతున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని ఆరోపించారు. అతని వేధింపులు భరించలేక తను ఉన్న హోటల్ రూమ్‌కి కాల్స్ కనెక్ట్ చేయవద్దని హోటల్ కుర్రాళ్లకి చెప్పానని.. ఆ హీరోకి తెలియకుండా రోజు తన హోటల్ రూమ్ మార్చేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అప్పటి తన స్నేహితుడు ఇప్పుడు తన భర్త ఎంతో సాయం చేసారని కూడా చెప్పారు విచిత్ర. తనకు ఎదురైన దారుణమైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయానని .. ఆ అనుభవంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పానని విచిత్ర చెప్పారు. సినిమా ఇండస్ట్రీని తన కుటుంబం అని భావించానని.. కానీ కాదని అర్ధమైందని అందుకే తను పెళ్లి చేసుకుని భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉన్నానని విచిత్ర చెప్పారు.

విచిత్ర చేసిన వ్యాఖ్యల ప్రకారం 2001 లో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విజయకాంత్ ఉన్నారు. ఆమె చెప్పిన మాటల ప్రకారం 2000-2001 లో విచిత్ర ఫిర్యాదు చేసింది విజయకాంత్‌కే అయి ఉంటుందని..అప్పుడు విజయకాంత్ ఆమెకు సాయం చేసి ఉండకపోవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ తెలుగు హీరోతో విజయ్ కాంత్‌కు స్నేహం ఉండటం వల్లే ఇలా చేసి ఉంటారా? అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విచిత్ర వ్యాఖ్యలపై నటుడు, పొలిటీషియన్ అయిన కమల్ హాసన్ ఏం చెప్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. వచ్చే శని, ఆదివారాల్లో విచిత్రను వేధించిన ఆ వ్యక్తి గురించి కమల్ హాసన్ విచిత్రతోనే చెప్పించే ప్రయత్నం చేస్తారా? లేక తనకి ఆ నటుడితో ఉన్న స్నేహం కారణంగా లేదా అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా బిగ్ బాస్‌లో ఆ సీన్ జరగకుండా దాటవేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం పలు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

RT4GM : రవితేజ – గోపీచంద్ సినిమా ఆగిపోయిందా? కారణం ఏంటి? ఈ కాంబోలో ఇంకో హిట్ ఉంటుందా?

1991 లో సినిమాల్లోకి అడుగుపెట్టిన విచిత్ర తెలుగు, మళయాళం, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపుగా 90 సినిమాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్‌తో 1995 లో ‘పోకిరి రాజా’, 2001 లో బాలకృష్ణ  సినిమా ‘భలేవాడివి బాసు’లో కనిపించారు. విజయ్ టెలివిజన్ ఫేమస్ కుకింగ్ రియాలిటీ షో’కుకు విత్ కోమలి 4’  ఫైనలిస్ట్ లలోవిచిత్ర ఒకరు.