Mirai: మిరాయ్ మేకర్స్ కి షాక్.. నా కథను కాపీ చేశారు.. హైకోర్టులో పిటీషన్ వేసిన రచయిత

మిరాయ్ మేకర్స్ కి బిగ్ షాక్ తగిలింది. తన కథను కాపీ చేసి మిరాయ్(Mirai) సినిమా చేశారంటూ ఆంద్రప్రదేశ్ కి చెందిన గిరిధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు.

Petition filed in AP High Court against Mirai movie

Mirai: మిరాయ్ మేకర్స్ కి బిగ్ షాక్ తగిలింది. తన కథను కాపీ చేసి మిరాయ్ సినిమా చేశారంటూ ఆంద్రప్రదేశ్ కి చెందిన గిరిధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నేను రచించిన ‘ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్’ పుస్తకాన్ని కాపీ చేసి మిరాయ్(Mirai) సినిమా చేశారు. మిరాయ్ మేకర్స్ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అనుమతి లేకుండా నేను రాసిన పుస్తకంలోని కథ, పాత్రలు, సన్నివేశాలను సినిమాలో ఉపయోగించారని” తెలిపారు. దీంతో మిరాయ్ సినిమా దర్శకుడు, నిర్మాతతో పాటు ఇతర వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సోమవారం(సెప్టెంబర్ 22) జరిగే అవకాశం ఉంది.

Ntr: ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు.. టీం ప్రకటన.. రెండు వారాల రెస్ట్

ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే, తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. యాక్షన్ అడ్వెంచర్ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మొదటి రోజే రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.