Ntr: ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు.. టీం ప్రకటన.. రెండు వారాల రెస్ట్

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరుగుతున్న (Ntr)ఒక యాడ్ షూట్ లో భాగంగా ఆయనకు ఈ ప్రమాదం జరిగింది.

Ntr: ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు.. టీం ప్రకటన.. రెండు వారాల రెస్ట్

The team released an official statement on the accident that happened to NTR.

Updated On : September 19, 2025 / 6:10 PM IST

Ntr: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరుగుతున్న ఒక యాడ్ షూట్ లో భాగంగా ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. తాజాగా ఈ విషయంపై అధికారికంగా స్పందించారు ఎన్టీఆర్ టీం. ఈమేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. “యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి చిన్న ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలు అయ్యాయి. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యం తో కోలుకోవడానికి ఆయన రెండు(Ntr) వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హామీ ఇస్తున్నాం. అభిమానులు, మీడియా ఎలాంటి ఊహాగానాలకు లోనుకాకుండా, సహకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.

Kantara 2 Trailer: కాంతార 2 ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

Ntr accedent Press note