Tarun : క్రికెట్ ఆడటానికి వెళ్లి కంగారూలతో ఆడుకుంటున్న తరుణ్

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో తరుణ్ టాలీవుడ్ నటులు ఆడే క్రికెట్ మ్యాచ్‌లలో యాక్టివ్‌గా పాల్గొంటారు. తాజాగా ఆస్ట్రేలియా వెళ్లిన తరుణ్ అక్కడ కంగారూలతో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tarun

Tarun : ఇటీవలే తెలుగు స్టార్స్ అంతా కలిసి ఒక చారిటీ కోసం ‘సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్’ (CCC) ఆడి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లో టాలీవుడ్ స్టార్స్ అక్కడ ఉంటున్న తెలుగు ప్లేయర్స్‌తో మ్యాచ్ ఆడారు. అక్కడి వెళ్లిన స్టార్స్‌లో తరుణ్ కూడా ఉన్నారు. ఆట ఆడి అలసిపోయిన తరుణ్ ప్రస్తుతం కంగారూలతో ఆడుకుంటున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bhimaa : మొన్న హనుమాన్.. ఇప్పుడు భీమా.. రేపు కల్కి.. ఆ పాయింట్‌తో సినిమాలు..

హీరో తరుణ్ ‘మనసు మమత’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నువ్వే కావాలి సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన తరుణ్ ఆ తర్వాత ప్రియమైన నీకు, చిరుజల్లు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నీ మనసు నాకు తెలుసు, సఖియా, శశిరేఖా పరిణయం, వేట వంటి సినిమాల్లో నటించారు. 2018 లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ సినిమా తర్వాత తరుణ్ సినిమాల్లో యాక్టివ్ లేరు. కాగా ఏటా సెలబ్రిటీలు ఆడే క్రికెట్ లీగ్ (CCL) లో తరుణ్ క్రికెట్ ఆడుతుంటారు.

Darshan : ఆ హీరోపై కేసు పెట్టిన 35 మంది మహిళలు.. చిక్కుల్లో స్టార్ హీరో

రీసెంట్‌గా తరుణ్ ఓ చారిటీ కోసం ఆడిన మ్యాచ్ ‘సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్’ (CCC) కోసం టాలీవుడ్ స్టార్స్‌తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడి తెలుగు ప్లేయర్స్ తో కలిసి క్రికెట్ ఆడారు. ఈ మ్యాచ్‌లో టాలీవుడ్ నుండి శ్రీకాంత్, తరుణ్, నిఖిల్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, థమన్, సుశాంత్, ప్రిన్స్, ఆది, ఓంకార్, అశ్విన్, భూపాల్, సామ్రాట్, విజె సన్నీ ప్లేయర్స్ గా పాల్గొన్నారు. మ్యాచ్ గెలిచారు కూడా. ఆడి అలసిపోయిన స్టార్స్ అంతా ప్రస్తుతం సేద తీరుతున్నారు. హీరో తరుణ్ కంగారూలతో ఆడుకుంటున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు