Ashish Vidyarthi : ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి పై మొదటి భార్య కామెంట్స్..
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి ఇటీవల రూపాలీ బారువాను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీని పై అతడి మొదటి భార్య రెస్పాండ్ అయ్యింది.

Piloo Vidyarthi comments on Ashish Vidyarthi second marriage with Rupali Barua
Ashish Vidyarthi Wife Piloo Vidyarthi : ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది. 60 ఏళ్ల వయసులో ఉన్న ఆశిష్.. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలీ బారువాను (Rupali Barua) మే 25న వివాహం చేసుకున్నాడు. ఈయన ప్రముఖ నటి శకుంతల బారువా కూతురు పిలూ విద్యార్థి అలియాస్ రాజోషి విద్యార్థి 2001 లో పెళ్లి చేసుకున్నారు. 22 ఏళ్ళ పాటు అన్యోనంగా ఉన్న వీరిద్దరికి అర్త్ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు.
K Vasu : ఇండస్ట్రీలో మరో విషాదం.. చిరంజీవి ఫస్ట్ మూవీ దర్శకుడు మృతి..
అయితే ఇంత బాగా ఉన్న వీరిద్దరూ ఎప్పుడు విడిపోయారు, ఎందుకు విడిపోయారు అన్న విషయాలు పై ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా రూపాలీ బారువా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ విషయాలు పై ఆమె మాట్లాడారు. ఆశిష్ విద్యార్థితో తన దాంపత్య బంధంలో అసలు పెద్దగా గొడవలు పడిన సందర్భాలు లేవని, 22 ఏళ్ళ తన మ్యారేజ్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పుకొచ్చింది. విడాకులు విషయంలో ఎవరి బలవంతం లేదని, ఇద్దరి ఏకాభిప్రాయంతోనే విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్ లో విడాకులకు అప్లై చేసినట్లు ఆమె వెల్లడించారు.
Aditi Arya : ఇండియన్ బిలియనీర్‌తో కళ్యాణ్ రామ్ హీరోయిన్ పెళ్లి..
ఇక ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరికి రెండో అవకాశం అన్నది అవసరం. అలా తను మరో తోడు కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. అది తప్పు కాదు. అయితే నేను మాత్రం ఒంటరిగానే నడవాలని అనుకుంటున్నాను. అలాగే మా ఇన్నాళ్ల బంధంలో ఆశిష్ ఎప్పుడు నా నిర్ణయాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. నా స్వంత గుర్తింపు కావాలి అనే ఆలోచనను తను ప్రోత్సహించేవాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.