×
Ad

Pinky Sudeepa : ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీని గుర్తుపట్టారా..? తల్లి అయిన పింకీ సుదీప.. వీడియో వైరల్..

బిగ్ బాస్ సీజన్ 6లో మళ్ళీ పింకీ సుదీప ఎంట్రీ ఇచ్చి వైరల్ అయింది. (Pinky Sudeepa)

Pinky Sudeepa

Pinky Sudeepa : నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ తో కలిసి కామెడీతో అదరగొట్టిన చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన పింకీ ఆ తర్వాత చదువులు, పెళ్లితో సినిమాలకు దూరమయింది. బిగ్ బాస్ సీజన్ 6లో మళ్ళీ పింకీ సుదీప ఎంట్రీ ఇచ్చి వైరల్ అయింది.

అప్పట్నుంచి పింకీ పలు టీవీ షోలలో, సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. బిగ్ బాస్ లో ఉన్నపుడు తనకు ఓ సారి గర్భం వచ్చి పోయిందని ఎమోషనల్ అయింది. ఇప్పుడు పింకీ సుదీప తల్లి అయింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం తన బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది. ఓ వారం రోజుల క్రితం తమకు బాబు పుట్టాడని అధికారికంగా ప్రకటించింది సుదీప.

Also Read : Neha Sharma : పాపం రామ్ చరణ్ హీరోయిన్.. ఇల్లిల్లు తిరిగినా ఎన్నికల్లో ఓడిపోయిన తండ్రి.. ప్రచారం వీడియో వైరల్..

తాజాగా తన బాబుకి బారసాల నిర్వహించగా భర్త, కొడుకుతో ఉన్న చిన్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో పింకీ సుదీప, ఆమె భర్త రంగనాథ్ తమ బాబుని ముద్దాడుతూ ఫోటోకి ఫోజులిచ్చారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. తమ బాబు పేరు మాత్రం వెల్లడించలేదు పింకీ.