Neha Sharma : పాపం రామ్ చరణ్ హీరోయిన్.. ఇల్లిల్లు తిరిగినా ఎన్నికల్లో ఓడిపోయిన తండ్రి.. ప్రచారం వీడియో వైరల్..
తాజాగా రామ్ చరణ్ హీరోయిన్ బీహార్ లో తన తండ్రి ప్రచారంలో పాల్గొన్నా ఆయన ఓడిపోయాడు.(Neha Sharma)
Neha Sharma
Neha Sharma : ఇటీవల బీహార్ ఎన్నికలు జరగగా బీజేపీ కూటమి అక్కడ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి దరిదాపుల్లో కూడా లేదు. కాంగ్రెస్ సింగిల్ గా డబల్ డిజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. ఎలక్షన్స్ లో రాజకీయ నాయకుల కోసం సినీ సెలబ్రిటీలు ప్రచారం చేస్తారని తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ హీరోయిన్ బీహార్ లో తన తండ్రి ప్రచారంలో పాల్గొన్నా ఆయన ఓడిపోయాడు.(Neha Sharma)
రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో హీరోయిన్ గా పరిచయమయింది బీహార్ భామ నేహశర్మ. తెలుగులో కేవలం చిరుత, కుర్రాడు సినిమాలు చేసింది. ఇటీవల హాయ్ నాన్న సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. నేహశర్మ తండ్రి అజిత్ శర్మ ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉన్నారు. బీహార్ లోని పెద్ద సిటీలలో ఒకటైన భగల్ పూర్ నుంచి ఆయన మూడు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో నేహశర్మ తండ్రి గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. ఇటీవల ప్రచారం చేసిన వీడియోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మూడు సార్లు ఎమ్మెల్యే అయినా, హీరోయిన్ ప్రచారం చేసినా అజిత్ శర్మ ఓడిపోయారు. బీహార్ లో వీచిన బీజేపీ పవనాలకు భగల్ పూర్ బీజేపీ క్యాండిడేట్ రోహిత్ పాండే చేతుల్లో ఓడిపోయాడు. దాదాపు 13 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయాడు అజిత్ శర్మ.
దీంతో నేహా శర్మ తన తండ్రి కోసం ప్రచారం చేసి షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
View this post on Instagram
