Tollywood Comedians : చిల్డ్రన్స్ డే స్పెషల్.. కమెడియన్స్ అంతా భలే రెడీ అయ్యారే.. ఈ ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..
ఇలా చిన్నపిల్లల్లా రెడీ అయి ఫోటో దిగడంతో ఈ గ్రూప్ ఫోటో వైరల్ గా మారింది.(Tollywood Comedians)
Tollywood Comedians
Tollywood Comedians : సినీ పరిశ్రమలో నటీనటుల్లో కూడా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో కొంతమంది గ్రూప్స్ గా ఉండి అప్పుడప్పుడు కలిసి పార్టీలు చేసుకుంటారు. అలాంటి గ్రూప్స్ లో ఫ్లైయింగ్ కలర్స్ ఒకటి. తెలుగు పరిశ్రమలోని కొంతమంది కమెడియన్స్ అంతా కలిపి ఈ ఫ్లైయింగ్ కలర్స్ గ్రూప్ పెట్టుకున్నారు.(Tollywood Comedians)
అప్పుడప్పుడు ఈ గ్రూప్ అంతా కలిసి పార్టీ చేసుకోవడం, అందరూ ఒకే రకంగా రెడీ అయి ఫోటో దిగడం చేస్తూ ఉంటారు. నిన్న నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ కమెడియన్స్ అంతా కలిసి స్కూల్ డ్రెస్ లో షర్ట్, టై, నిక్కర్ వేసుకొని రెడీ అయ్యారు. ఇలా చిన్నపిల్లల్లా రెడీ అయి ఫోటో దిగడంతో ఈ గ్రూప్ ఫోటో వైరల్ గా మారింది.

ఈ గ్రూప్ ఫోటోను కమెడియన్ ధనరాజ్ షేర్ చేసాడు. ఈ ఫొటోలో.. నవీన్ నేని, ధనరాజ్, సప్తగిరి, నందు, సత్య, వేణు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, రఘు ఉన్నారు. నటుడు ప్రవీణ్ ఈ ఫొటోలో మిస్ అయ్యాడు. వీరంతా కమెడియన్స్ గా, యాక్టర్స్ గా అనేక సినిమాలతో జనాల్ని మెప్పిస్తున్నారు.
వీరంతా ఫ్లైయింగ్ కలర్స్ పేరుతో ఓ గ్రూప్ గా ఏర్పడి అప్పుడప్పుడు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఇంతమంది కమెడియన్స్ ఒకేసారి స్కూల్ డ్రెస్ లో కనపడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Kamakshi Bhaskarla : విశ్వక్ సేన్ సినిమాలో చేసినందుకు తిట్టారు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..
View this post on Instagram
