Kamakshi Bhaskarla : విశ్వక్ సేన్ సినిమాలో చేసినందుకు తిట్టారు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..
తను నటించిన విశ్వక్ సేన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Kamakshi Bhaskarla)
Kamakshi Bhaskarla
Kamakshi Bhaskarla : తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల డాక్టర్ చదివి స్టేజ్ పర్ఫార్మెన్స్ లు చేసి అనంతరం సినిమాల్లోకి వచ్చింది. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు హీరోయిన్ గా కూడా వరుస సినిమాలు చేస్తుంది. పొలిమేర సినిమాతో ఒక్కసారిగా మంచి హైప్ వచ్చింది. త్వరలో అల్లరి నరేష్ సరసన 12A రైల్వే కాలనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.(Kamakshi Bhaskarla)
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది కామాక్షి. ఈ క్రమంలో తను నటించిన విశ్వక్ సేన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Chiranjeevi : మెగాభిమానికి పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. దేవుడు వరం ఇచ్చాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. నాకు ఎక్కువగా సీరియస్ రోల్స్ వస్తున్నాయి. అవి సక్సెస్ అవ్వడంతో అవే వస్తున్నాయి. ఒకానొక సమయంలో 20 కథల వరకు రిజెక్ట్ చేశాను. లైలా సినిమాలో పాత్ర కొంచెం డిఫరెంట్. పలు కారణాలతో ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా హిట్ అయి ఉంటే నన్ను ఇంకా అభినందించేవాళ్ళు. ఆ క్యారెక్టర్ కి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను ఇలా కనపడతాను. కానీ ఆ సినిమాలో అలా కనపడటానికి చాలా కష్టపడ్డాను. బాడీ షేమింగ్ యాక్టింగ్ అది. అందులోను యంగ్ హీరో విశ్వక్. ఎందుకు ఇలాంటి పాత్ర చేశాను అని చాలామంది తిట్టారు. నేను దాన్ని క్రియేటివ్ యాంగిల్ లో చూసాను. అలాంటి పాత్రలో చేయగలనా లేదా అని చేశాను. కానీ సినిమా జనాలకు నచ్చలేదు అని తెలిపింది.
విశ్వక్ సేన్ లైలా సినిమాలో కామాక్షి భాస్కర్ల బాగా నల్లగా ఉండే అమ్మాయి, మేకప్ తో తన రంగు కవర్ చేసి విలన్ ని పెళ్లి చేసుకునే అమాయిక యువతి పాత్రలో నటించింది. కామాక్షి బాగానే నటించినా ఆమె పాత్రకు అభినందనలు వచ్చినా సినిమా మాత్రం హిట్ అవ్వలేదు.
Also Read : Chiranjeevi : వామ్మో చిరంజీవికి ఎంత ఓపికో.. ఆదివారం కూడా.. అందుకే ఆయన మెగాస్టార్..
