Chiranjeevi : మెగాభిమానికి పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. దేవుడు వరం ఇచ్చాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..
తాజాగా మరో మెగా ఫ్యాన్ అయిన డ్యాన్స్ మాస్టర్ సందీప్ కి చిరంజీవి పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చారు.(Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళను ఎంతలా దగ్గరకు తీసుకుంటారో అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమలో కూడా చాలా మంది మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే అనేకమంది మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఆయన సినిమాల్లో అవకాశం ఇచ్చారు చిరంజీవి. తాజాగా మరో మెగా ఫ్యాన్ అయిన డ్యాన్స్ మాస్టర్ సందీప్ కి చిరంజీవి పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చారు.(Chiranjeevi)
ఆట షోతో ఫేమ్ తెచ్చుకున్న సందీప్ మాస్టర్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారారు. పలు టీవీ షోలు, సినిమాలు, ఈవెంట్స్ చేస్తూ వస్తున్నారు. సందీప్ వైఫ్ జ్యోతి కూడా డ్యాన్సర్ కావడంతో ఇద్దరూ కలిసి తమ డ్యాన్సులతో మెప్పిస్తారు. ఆట సందీప్ చిరంజీవికి వీరాభిమాని అని అనేకమార్లు చెప్పాడు. తాజాగా ఆట సందీప్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Bollywood Couple : పండంటి పాపాయికి జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్.. వెడ్డింగ్ యానివర్సరీ రోజే డెలివరీ..
ఆట సందీప్, తన భార్య జ్యోతి చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి.. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. స్వయంగా ఆ దేవుడు, మెగాస్టార్ చిరంజీవి గారిలా దిగివచ్చి మాకు వరం ఇచ్చినట్టుగా అనిపించింది. ఇన్నేళ్ళుగా నేను నమ్ముకున్న నా డాన్స్‌ను, నా కష్టాన్ని చూసి ఆయనే స్వయంగా నన్ను ఇంటికి పిలిచి, నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం చేసినట్టుగా అనిపించింది. అది పూర్తిగా దైవానుగ్రహం లాంటి అనుభూతి. హృదయం మొత్తం ఆనందంతో నిండిపోయింది. అందులోను మా జంట గురించి, నా వైఫ్ జ్యోతి గురించి ఆయన చెప్పిన మాటలు, మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, మా జీవితానికి కొత్త బలం, ముందుకు నడిపించే పెద్ద ధైర్యం ఇచ్చాయి. ఆ మాటలు మా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. చిరంజీవి గారు స్వయంగా పిలిచి ఇచ్చిన ఈ అవకాశం చిన్నప్పటి నుండి కలగన్న ఆ కల నిజంగా నెరవేరిన రోజు. ఆయనతో కూర్చొని మాట్లాడిన ప్రతీ క్షణం, ఆయన చూపిన ఆప్యాయం, వినయం, ప్రేమ అన్నీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులయ్యాయి. సహృదయ కృతజ్ఞతలతో ధన్యవాదాలు చిరంజీవి గారూ, ఈ అవిస్మరణీయ అవకాశం, మీ ఆశీర్వాదాలు, మీ ప్రేమ ఇవి నాకు కొత్త దారి, కొత్త శక్తి ఇచ్చాయి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
మరి మెగాస్టార్ కి ఏ సినిమాలో ఆట సందీప్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడో, వీరి కాంబోలో వచ్చే ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Priyanka Chopra : 23 ఏళ్ళ క్రితమే తెలుగులో సినిమా చేసిన ప్రియాంక చోప్రా.. రాజమౌళి – మహేష్ ఫస్ట్ కాదు..
