Kamakshi Bhaskarla : నిజంగా ఈ హీరోయిన్ గ్రేట్.. షూటింగ్ లో అందరూ జ్వరం వచ్చి పడిపోతే.. ఇంత మంచోళ్ళు ఎవరుంటారు భయ్యా..
త్వరలో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ సినిమాతో రాబోతుంది కామాక్షి. (Kamakshi Bhaskarla)
Kamakshi Bhaskarla
Kamakshi Bhaskarla : డాక్టర్స్ నుంచి యాక్టర్స్ గా మారిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఒకరు. పొలిమేర సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఈ భామ ఓ పక్క హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క కీ రోల్స్ చేస్తుంది. త్వరలో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ సినిమాతో రాబోతుంది కామాక్షి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడింది.(Kamakshi Bhaskarla)
కామాక్షి భాస్కర్ల MBBS చదివిన తర్వాత జనరల్ ఫిజీషియన్ గా అపోలో హాస్పిటల్ లో కొన్నాళ్ళు వర్క్ చేసింది. కరోనా తర్వాత మానేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చింది. తన డాక్టర్ వృత్తి షూటింగ్స్ లో కూడా ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకొచ్చింది.
Also Read : Kamakshi Bhaskarla : విశ్వక్ సేన్ సినిమాలో చేసినందుకు తిట్టారు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. నేను నటించే అన్ని సెట్స్ లో నేనే డాక్టర్. నా మొదటి వెబ్ సిరీస్ గోవాలో షూటింగ్ జరుగుతుంటే సెట్ లో డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్.. చాలా మంది ఫీవర్ వచ్చి పడిపోయారు. దాంతో నేనే ఇంజెక్షన్స్, ట్యాబ్లేట్స్ ఇచ్చి చూసుకున్నాను. పొలిమేర సెట్స్ లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎవరికైనా గాయాలు అయితే నేనే చూసుకున్నాను. మారేడుమిల్లి ప్రజానీకం సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది. నేనే ఇంజెక్షన్స్ ఇచ్చాను. నా పర్సనల్ టీమ్ పిలిపించి ట్రీట్ చేశాను.
సెట్స్ లో నా రెండు ప్రొఫెషన్స్ ని వాడుకుంటారు. మన యూనియన్స్ వాళ్ళతో మాట్లాడి ఒక పారా మెడికల్ కల్చర్ ని ఇక్కడకు తీసుకురావాలని అనుకుంటున్నాను. సెట్ లో ఒక డాక్టర్ ఉండాలి. యాక్షన్స్ ఎపిసోడ్స్ లో, ఎలెక్ట్రిక్ పనిచేసేటప్పుడు కొంతమంది సెట్ లోనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇండియన్ సినిమాలో పారా మెడికల్ కల్చర్ లేదు. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసే పారా మెడికల్ కల్చర్ అయినా ఉండాలి. 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి అందర్నీ మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు ఎవరికీ ఏం అవుతుందో తెలీదు అని తెలిపింది.
Also Read : Bollywood Couple : పండంటి పాపాయికి జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్.. వెడ్డింగ్ యానివర్సరీ రోజే డెలివరీ..
దీంతో ఓ పక్క నటిస్తూనే సెట్ లో డాక్టర్ గా కూడా బాధ్యతలు తీసుకోవడంతో ఆమెని అభినందిస్తున్నారు. చాలామంది డాక్టర్స్ నటీనటులుగా మారినా ఇలా సెట్ లో బాద్యతలు తీసుకునే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. కామాక్షి యాక్టర్, డాక్టర్ మాత్రమే కాకుండా రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తను పనిచేసే సినిమాలకు చేస్తుంది.
View this post on Instagram
