పీఎం నరేంద్ర మోడీ సినిమాకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. మూవీ విడుదల ఆపుతూ ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు బెంచ్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఏప్రిల్ 09వ తేదీ CBFC యు సర్టిఫికేట్ ఇచ్చిందని, ప్రపంచ వ్యాప్తంగా సినిమాను ఏప్రిల్ 11న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు ఒమంగ్ కుమార్ వెల్లడించారు. యు సర్టిఫికేట్ ఇవ్వడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. సినిమాను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చుతుందని తెలిపారు. సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు.
ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సందీప్ సింగ్, సురేష్ ఒబెరాయ్, ఆనంద్ పండిట్, ఆచార్య మనీష్ నిర్మాతలు. పీఎం మోడీ బయోపిక్ ట్రైలర్ ఇప్పటికే ఓ సెన్సేషన్ సృష్టించింది. ఏప్రిల్ 11వ తేదీ గురువారం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ టైంలో సినిమా రిలీజ్ చేయవద్దని..ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉందంటూ కాంగ్రెస్ కార్యకర్త అమన్ పన్వర్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం దాన్ని ఇటీవలే కొట్టివేసింది. సినిమా ఎలా ఉంది ? అనేది తెలుసుకోవాలంటే రేపటి వరకు అంటే ఏప్రిల్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.
#CensorNews: #PMNarendraModi certified U by Indian censors #CBFC on 9 April 2019. Approved run time: 130 min, 53 sec [2 hours, 10 minutes, 53 seconds]. #India
— taran adarsh (@taran_adarsh) April 9, 2019