రష్మిక డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్టు.. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌ వాసిగా గుర్తింపు

రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. అనేకమంది సెలబ్రిటీలు ఈ ఘటనపై విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna

Rashmika Mandanna : నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో గతేడాది నవంబర్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు రష్మికకు మద్దతుగా నిలిచి ఇలాంటి వీడియోలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : చిరంజీవి ‘విశ్వంభర’ కోసం 13 సెట్లు.. విశ్వం అంతా కనపడేలా..

రష్మిక డీప్ నెక్‌తో ఉన్న బ్లాక్ డ్రెస్‌లో లిప్ట్‌లోకి వెళ్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజ్ చేస్తున్నట్లు కనిపించింది. దీని ఒరిజినల్ వీడియో జరా పటేల్ అనే బ్రిటిష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ది. డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా జరా పటేల్ ముఖాన్ని రష్మికగా మార్చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో అనేకమంది సెలబ్రిటీలు మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ఇలాంటి వీడియోలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది.

Also Read: చిత్ర పరిశ్రమకు అన్నీ కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది.. మంచు మోహన్ బాబు వ్యాఖ్యలు

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు డీప్‌ఫేక్‌కి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఇందుకు కారణమైన వ్యక్తిని ఈ రోజు పోలీసులు అరెస్టు చేసారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి ఈ వీడియో తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని ఏపీలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.