కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్‌ పై పోలీసు కేసు

Police case file against Koyilamma serial hero Sameer : కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్యం మత్తులో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై సమీర్‌ దౌర్జన్యానికి దిగినట్టు శ్రీవిద్య అనే బాధితులు ఆరోపిస్తున్నారు.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో.. శ్రీవిద్య ఇంటికెళ్లి వస్తువులు లాక్కుని లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె కంప్లైంట్ చేశారు. అమర్‌తో పాటు మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని తెలిపారు.

శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాలవల్ల స్వాతి బౌటిక్ వ్యవపరం నుండి తప్పుకుంది. స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు శ్రీవిద్య ఇవ్వకపోవడంతో నిన్న రాత్రి సమీర్ తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లారు.

శ్రీవిద్య ఇంట్లో మాట మాట పెరిగి అది కాస్త గొడవకు దారి తీసింది. ఇట్టి విషయం పై ఒకరి పై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.