Venu Thottempudi : హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. అసలు రీజన్ ఇదే..!

Venu Thottempudi : నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ సభ్యులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Actor Venu Thottempudi

Venu Thottempudi : టాలీవుడ్ హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధిగా ఉన్న తొట్టెంపూడి వేణు.. రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.

Read Also : Allu Arjun : అల్లు అర్జున్ మళ్ళీ అలాంటి సినిమా చేయాలనుకుంటున్నాడా..? దేవిశ్రీ ప్రసాద్ ఏం చెప్పాడో తెలుసా?

ఆ తర్వాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మధ్యలోనే తప్పుకుంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేసుకున్నట్టుగా తెలిసింది. దాంతో వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేసింది.

మధ్యలో కాంట్రాక్టు రద్దు చేయడం వల్ల భారీ నష్టం వచ్చిందని ప్రొగ్రెసివ్ సంస్థ నిర్వాహకులపై రిత్విక్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ పరిశీలనలోకి తీసుకున్న నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

Read Also : Ram Charan : రామ్ చరణ్ సెట్లోకి స్పెషల్ గెస్ట్.. ఎవరో గుర్తుపట్టారా? ఉపాసన కామెంట్ ఇదిగో..!

కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ సభ్యులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో స్వయంవరం, చిరునవ్వుతో వంటి సినిమాలతో హీరో వేణు తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బిజినెస్ వ్యవహారాలతో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధిగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.