Ram Charan : రామ్ చరణ్ సెట్లోకి స్పెషల్ గెస్ట్.. ఎవరో గుర్తుపట్టారా? ఉపాసన కామెంట్ ఇదిగో..!
Ram Charan : ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో గుర్తుపట్టారా? అది ఎవరో కాదు.. చెర్రీ గారాలపట్టి క్లిన్ కారా. చరణ్ తన కుమార్తెను ఎత్తుకొని ఉన్న ఫొటోకు గెస్ట్ అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

Ram Charan Shares Cute Pic with His Daughter Klin Kaara
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త మూవీకి రెడీ అవుతున్నాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత ఆర్సీ16లో చెర్రీ నటిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కొత్త మూవీకి పేరు పెట్టలేదు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
Read Also : Sreemukhi : ఫ్యామిలీతో కలిసి యాంకర్ శ్రీముఖి సత్యనారాయణ స్వామి వ్రతం.. ఫోటోలు చూశారా?
అయితే, ఈ మూవీకి సంబంధించి సెట్లోకి బుధవారం (ఫిబ్రవరి 5) ఒక్కసారిగా ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి సందడి చేసింది. ఇంతకీ, ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో గుర్తుపట్టారా? అది ఎవరో కాదు.. చెర్రీ గారాలపట్టి క్లిన్ కారా. అవును.. చరణ్ తన కుమార్తెను ఎత్తుకొని ఉన్న ఫొటోకు గెస్ట్ అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ పోస్టు వైరల్ :
రామ్ చరణ్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. పెద్దగా ఏ పోస్టు పెట్టినట్టుగా కనిపించడు. అప్పుడప్పుడు మాత్రం తన ఇన్‌స్టా అకౌంట్లో ఒకటి రెండు పోస్టులు దర్శనమిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారిగా చరణ్ పెట్టిన ఒక పోస్ట్ చూసి ఫ్యాన్స్ అంతా క్యూట్ మూమెంట్ అంటున్నారు.
ఇంతకీ రామ్ చరణ్ పోస్టు చేసిన పోస్టు ఏంటంటే.. “సెట్‌లో నా చిన్న గెస్ట్ #RC16” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. చరణ్ తన కుమార్తె క్లిన్ కారాను ఎత్తుకొని ఉన్నాడు. తండ్రీకూతురు క్యూట్‌గా మాట్లాడటం ఫొటోలో చూడొచ్చు. మూవీకి సంబంధించి ఏదో ఎగ్జిబిషన్ సెట్ మాదిరిగా కనిపిస్తోంది.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ మళ్ళీ అలాంటి సినిమా చేయాలనుకుంటున్నాడా..? దేవిశ్రీ ప్రసాద్ ఏం చెప్పాడో తెలుసా?
ఉపాసన కామెంట్ :
ఈ ఫొటోకు ఉపాసన కామినేని కొణిదెల కామెంట్ చేసింది. FOMO (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) అని ఆమె ఓ ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది. అటు చెర్రీ ఫ్యాన్స్ కూడా జై చరణ్, జై జై చరణ్ అంటూ ఫోటోకు కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లి అయిన పదేళ్ల తర్వాత క్లిన్ కారా జన్మించింది. జూన్ 20, 2023లో పాప జన్మించింది. ఆ తర్వాత క్లిన్ కారా పేరుతోనే బాగా పాపులర్ అయింది. క్లిన్ కారా పేరు గురించి అప్పట్లో చాలామంది అర్థం కోసం ఇంటర్నెట్ తెగ వెతికారు.
View this post on Instagram
ఆర్సీ16 మూవీ విషయానికి వస్తే.. :
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత చరణ్ తన తర్వాతి సినిమా ఆర్సీ16 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర తర్వాత ఆమెకు తెలుగులో రెండో సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కాగా, ఆర్సీ16పైనే చెర్రీ ఫోకస్ పెట్టాడు.