Site icon 10TV Telugu

Krishna : ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ అరెస్ట్.. పోక్సో కేసు నమోదు..

Police Case Filed on Dhee fame Choreographer Krishna Master

Krishna

Krishna : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై గత నెలలో గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదు అయింది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాలిక కుటుంబ సభ్యుల పిర్యాదు చేసారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసారు. కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు.

కృష్ణ బెంగుళూరులోని తన అన్న నివాసంలో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం కంది జైలుకు తరలించారు గచ్చిబౌలి పోలీసులు. అలాగే కృష్ణకు ఇటీవలే ఓ మహిళతో వివాహం అయిందని, భార్యకు సంబంధించిన 9.50 లక్షలు నగదు తీసుకుని కృష్ణ వెళ్లాడని తెలుస్తుంది. గతంలో కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతుల్ని, మహిళని మోసం చేసినట్లు కృష్ణపై అభియోగాలు ఉన్నాయి.

Also Read : Kingdom Collections : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..?

కృష్ణ డ్యాన్సర్ గా పరిశ్రమలోకి వచ్చి ఢీ షో సీజన్స్ లో పాల్గొన్నాడు. సూపర్ జోడిలో రన్నరప్ గా, డ్యాన్స్ ఐకాన్ లో విన్నర్ గా గెలిచాడు. మట్కా సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారి పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేసారు.

Exit mobile version