Hari Hara VeeraMallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం జరిగినా నిర్మాతదే బాధ్యత.. సైబరాబాద్ పోలీసులు..

నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.

Hari Hara VeeraMallu

Hari Hara VeeraMallu : నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి కొంతమంది ఫ్యాన్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చారు. తాజాగా ఈ ఈవెంట్ కి పోలీస్ పర్మిషన్ క్లియర్ అయింది. దీనిపై పోలీసులు మాట్లాడారు.

హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈవెంట్ కి నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు. బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పోలీసులు తెలిపారు.

Also Read : Pawan Kalyan : నటించ‌డం త‌ప్ప సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం రాదు..

దీంతో ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చినా మొత్తం ఈవెంట్ కి నిర్మాతనే సంబంధం, సెక్యూరిటీ పరంగా కూడా లోపల, బయట నిర్మాతే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది.