Pawan Kalyan : నటించ‌డం త‌ప్ప సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం రాదు..

త‌న‌కు సినిమాల్లో న‌టించ‌డం త‌ప్ప ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో తెలియ‌ద‌ని ప‌వ‌న్ అన్నారు.

Pawan Kalyan : నటించ‌డం త‌ప్ప సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం రాదు..

Harihara Veeramallu pressmeet I donot know how to promt the movie Pawan Kalyan

Updated On : July 21, 2025 / 12:30 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న పీరియాడిక్ యాక్ష‌న్ ఫిల్మ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు జూలై 24న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం నేడు హైద‌రాబాద్‌లో స్పెష‌ల్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొని మాట్లాడారు.

‘నేను యాక్సిడెంట‌ల్‌గా న‌టుడిని అయ్యాను. గ‌చ్చ‌త‌రం లేక టెక్నీషియ‌న్ అయ్యాను. సినిమాల్లో న‌టించ‌డం త‌ప్ప సినిమాను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో నాకు తెలియ‌దు. ఏఎం ర‌త్నం కోస‌మే మీడియా ముందుకు వ‌చ్చాను.సినిమా బ‌త‌కాలి. ఆయ‌న క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కాలి అని ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హిస్తున్నాం. ‘అని ప‌వ‌న్ అన్నారు.

Pawan Kalyan : ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా ఆ నిర్మాత.. ప్రతిపాదించిన పవన్..

‘నేను పాలిటిక్స్ వలన సినిమాకు దూరంగా వెళ్లిన కూడా నేను మళ్ళి సినిమా చేయాలనీ రత్నం అడిగినపుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత ఈ సినిమా కోసం ఇచ్చాను. నేను ఉన్న పరిస్థితుల్లో సినిమా కోసం టైమ్ ఇవ్వాలేను. అలాంటిది ఈ సినిమా క్లైమాక్స్ కోసం 57 రోజులు ఇచ్చాను. నా వంతుగా ఎంత చేయాలో అంత సపోర్ట్ ఇచ్చాను.’ అని ప‌వ‌న్ తెలిపారు.