Pawan Kalyan : ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా ఆ నిర్మాత.. ప్రతిపాదించిన పవన్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న పీరియాడిక్ యాక్ష‌న్ ఫిల్మ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు.

Pawan Kalyan : ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా ఆ నిర్మాత.. ప్రతిపాదించిన పవన్..

Pawan Kalyan comments in harihara veeramallu pressmeet

Updated On : July 21, 2025 / 12:17 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న పీరియాడిక్ యాక్ష‌న్ ఫిల్మ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాగ్ క‌థానాయిక‌. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబీ డియోల్‌, అనుప‌మ్ ఖేర్‌, స‌త్య‌రాజ్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని కొంత భాగాన్ని క్రిష్ తెర‌కెక్కించారు. అయితే.. కొన్నికార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా నిర్మాత ర‌త్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ క్ర‌మంలో నేడు (జూలై 21) చిత్ర బృందం హైద‌రాబాద్‌లో స్పెషల్ ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించింది.

ప‌వ‌న్ పాల్గొని మాట్లాడాడ‌రు. సినిమాను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. ఈ ప్రెస్‌మీట్ పెట్ట‌డానికి కార‌ణం ఏఎం ర‌త్న‌మే అని చెప్పారు. సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాల‌న్నారు.

Ram charan : రామ్‌చ‌ర‌ణ్ బాడీ అదిరిపోయింది.. పెద్ది కోసం గ్లోబ‌ల్ స్టార్ క‌ష్టం చూశారా?

రీజనల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్య‌క్తి ర‌త్నం అని అన్నారు. ఇక తాను ఏఎం రత్నం ని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా చేయ‌మ‌ని ముఖ్య‌మంత్రికి చెప్పిన‌ట్లు తెలిపారు. ‘భవిష్యత్తులో అవ్వొచ్చు.. అన్ని మన చేతిలో ఉండవు.’ అని ప‌వ‌న్ అన్నారు.