Ram charan : రామ్‌చరణ్ బాడీ అదిరిపోయింది.. పెద్ది కోసం గ్లోబల్ స్టార్ కష్టం చూశారా?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది.

RamCharan is undergoing a rigorous training and transforming himself for Peddi
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
తాజాగా ఈ చిత్రంపై చరణ్ మరింత హైప్ పెంచాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్ గుబురు గడ్డం, చిన్న పిలక, సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. అచ్చం హాలీవుడ్ హీరోగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.