నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ పై దాడి కేసులో పహాడీ షరీఫ్ పోలీసులు బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద ఈ కేసును నమోదు చేశారు. ఈ కేసులో మోహన్ బాబు వాంగ్మూలన్ని నమోదు చేసేందుకు, ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే.. పోలీసులు వెళ్లిన సమయంలో మోహన్ బాబు తన నివాసంలో లేనట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. దాడి ఘటనపై జర్నలిస్ట్‌కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ మోహన్ బాబు ఓ లేఖను విడుదల చేశారు. ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడానికి, జరిగిన సంఘటనల పట్ల నా ప్రగాఢ విచారం వ్యక్తం చేయడానికి లేఖ రాస్తున్నాన్నట్లు మోహన్ బాబు తెలిపారు.
Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ ప్రొమో.. ‘డేగ డేగ డేగ..’
వ్యక్తిగత కుటుంబ వివాదంగా ప్రారంభమై.. ఘర్షణకు దారి తీసిందన్నారు. ఈ ఘటనలో జర్నలిస్ట్ సోదరుడికి బాధ కలగడం తనకు బాధ కలిగిందన్నారు. తాను గత 48 గంటలుగా ఆసుపత్రిలో ఉన్నానని, అందుకనే వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు. ఆ రోజు ఇంటి గేట్లు విరిగిపోయి.. దాదాపు 30-50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. సంఘ వ్యతిరేక వ్యక్తులు, హాని చేయాలనే ఉద్దేశ్యంతో నా ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారన్నారు.
ఈ క్రమంలో తాను సహనాన్ని కోల్పోయానని చెప్పారు. ఈ గందరగోళం మధ్య, మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారన్నారు. తాను పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఓ జర్నలిస్ట్‌కు గాయమైందన్నారు. ఇది చాలా దురదృష్ట ఘటన అని చెప్పారు. సదరు జర్నలిస్ట్‌తో పాటు అతడి కుటుంబానికి కలిగిన బాధకు తీవ్రంగా చింతిస్తున్నట్లు తెలిపారు.
Mechanic Rocky : చడీ చప్పుడు లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘మెకానిక్ రాకీ’