Mechanic Rocky : చడీ చప్పుడు లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘మెకానిక్ రాకీ’
మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ.

Viswaksen Mechanic Rocky is now streaming on Amazon Prime Video
మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్‌లు కథానాయికలుగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
Jailer 2 : జైలర్ 2 లో బాలయ్య ఆ పాత్రలో కనిపించనున్నారా? పూనకాలే..
కొన్ని చిత్రాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలను అందుకోకున్నా.. ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మెకానిక్ రాఖీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సిందే.
ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతాన్ని అందించారు. ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజనీ తాళ్లూరి నిర్మించారు.
Pushpa 2 Collections : ‘పుష్ప 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? ఆల్ టైమ్ రికార్డ్..