Jailer 2 : జైలర్ 2 లో బాలయ్య ఆ పాత్రలో కనిపించనున్నారా? పూనకాలే..
సినీ ఇండస్ట్రీలో పూనకాలు తెప్పించే వార్త ఒక్కటి చక్కర్లు కొడుతుంది.

Nandamuri Balakrishna will play Gangster role in Jailer 2
సినీ ఇండస్ట్రీలో పూనకాలు తెప్పించే వార్త ఒక్కటి చక్కర్లు కొడుతుంది. ఆ వార్త వినగానే సినీ లోకం సర్‌ప్రైజ్ అయింది. ఇంతకీ నటసింహాం బాలయ్య సూపర్ రజనీ కాంత్‌తో కలసి ఏం చేయబోతున్నారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సెన్సేషనల్ హిట్ మూవీ జైలర్. ఈ సినిమా అన్ని లాంగ్వేజీస్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో పార్ట్ 2 చేయాలని డిసైడ్ అయ్యాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే పార్ట్-1లో శివరాజ్ కుమార్, జాకీ షరీప్, మోహన్ లాల్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేయించారు.
Pushpa 2 Collections : ‘పుష్ప 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? ఆల్ టైమ్ రికార్డ్..
ఇప్పుడు పార్ట్ 2 ఏ స్టార్ట్ చేస్తారంటూ డిస్కర్షన్ జరుగుతోంది. జైలర్ 2లో తెలుగు నుంచి నందమూరి బాలయ్య నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తర్వంలో అఖండ-2 స్టార్ట్ అవుతుంది. ఇక జైలర్2 కూడా బాలయ్య చేస్తే మరో విశ్వరూపం చూడటం కాయం. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టార్‌గా బాలయ్య కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
అసలే బాలయ్యకు మాస్ క్యారెక్టర్స్ వస్తే ఇరగదీస్తాడు. ఇక జైలర్-2లో ఊర మాస్ క్యారెక్టర్ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అటు సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఇటు బాలయ్య కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటూ ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇక జైలర్2 తో బాలయ్య కూడా తమిళ్ కన్నడ, మలాయాళంతోపాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.