Sambarala Yeti Gattu : సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా టైటిల్ ‘సంబరాల ఏటిగట్టు’.. అదిరిపోయిన గ్లింప్స్.. మారణ హోమం
టైటిల్ రివీల్ చేయడంతో పాటు సాయి దుర్గా తేజ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Sai Durgha Tej Sambarala Yeti Gattu Glimpse Out now
రోహిత్ కేపీ దర్శకత్వంలో మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. సాయి దుర్గాతేజ్ కెరీర్‌లో 18వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘SDT 18′ వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. టైటిల్ రివీల్ చేయడంతో పాటు సాయి దుర్గా తేజ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్‌ను పెట్టారు. ‘నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు సామీ అహానిది..’ అంటూ శ్రీకాంత్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమైంది. కత్తితో సాయి దుర్గా తేజ్ మారణ హోమం చేశాడు. యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి.
Vere Level Office : ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘వేరే లెవల్ ఆఫీస్’.. నువ్వులే నవ్వులు..
‘ఏటిగట్టు సాక్షిగా చెబుతుండా.. ఈ సారి నరికానంటే ఈ సారి అరుపు గొంతులోంచి కాదు తెగిన నరాల్లోంచి వస్తుంది.’ అని సాయి దుర్గా తేజ్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
Allu Arjun : రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. స్పందించిన టీమ్..