Allu Arjun : రాజ‌కీయాల్లోకి అల్లు అర్జున్‌.. స్పందించిన టీమ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజ‌కీయాల్లో రానున్న‌ట్లు గ‌తకొన్నాళ్లుగా రూమ‌ర్లు వ‌స్తున్నాయి.

Allu Arjun : రాజ‌కీయాల్లోకి అల్లు అర్జున్‌.. స్పందించిన టీమ్‌..

Icon Star Allu Arjun enter into politics is false

Updated On : December 12, 2024 / 5:49 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజ‌కీయాల్లో రానున్న‌ట్లు గ‌తకొన్నాళ్లుగా రూమ‌ర్లు వ‌స్తున్నాయి. దీనిపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లేన‌ని, అందులో ఎంత మాత్రం నిజం లేదంది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను వ్యాప్తి చేయ‌కుండా ఉండాల‌ని మీడియా సంస్థ‌ల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రిని కోరుకుంటున్న‌ట్లు తెలిపింది.

రాజ‌కీయాల్లోకి అల్లు అర్జున్ వ‌స్తున్నారు అన్న వార్తలు పూర్తిగా అబ‌ద్దం. ఇలాంటి నిరాధార‌మైన వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌తో ఉండాల‌ని స్ప‌ష్టం చేస్తున్నాం. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాల‌ని మీడియా సంస్థలు, వ్యక్తులను కోరుతున్నాము. ఇలాంటివి ఏమైనా ఉంటే మేము ఖ‌చ్చితంగా అప్‌డేట్‌ ఇస్తాం. అని అల్లు అర్జున్ టీమ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Bachhala Malli : అల్ల‌రి న‌రేశ్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ నుంచి ‘మ‌రీ అంత కోపం’ లిరిక‌ల్‌..

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. తొలి రోజు నుంచే క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన ఆరు రోజుల్లోనే ఈ మూవీ రూ.1002 కోట్ల‌ గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Daaku Maharaaj : బాల‌కృష్ణ ‘డాకు మ‌హారాజ్’ ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్‌..

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఓ చిత్రం విడుద‌లైన ఆరు రోజుల్లోనే రూ.1000కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఇదే తొలిసారి. ఇక రానున్న రోజుల్లో ఈ మూవీ ఎన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో చూడాల్సిందే.