Daaku Maharaaj : బాల‌కృష్ణ ‘డాకు మ‌హారాజ్’ ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్‌..

నందమూరి న‌ట సింహం బాలకృష్ణ న‌టిస్తున్నమూవీ డాకు మ‌హారాజ్‌.

Daaku Maharaaj : బాల‌కృష్ణ ‘డాకు మ‌హారాజ్’ ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్‌..

Nandamuri Balakrishna Daaku Maharaaj first single Update

Updated On : December 12, 2024 / 5:12 PM IST

నందమూరి న‌ట సింహం బాలకృష్ణ న‌టిస్తున్నమూవీ డాకు మ‌హారాజ్‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ్రద్దా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్ లు క‌థానాయిక‌లు. బాబీ డియోల్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని మొద‌టి పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Mohan Babu : ఆస్ప‌త్రి నుంచి సినీ న‌టుడు మోహ‌న్ బాబు డిశ్చార్జ్‌.. వారం రోజులు రెస్ట్..

సాంగ్ ప్రొమోను రేపు అన‌గా డిసెంబ‌ర్ 13 శుక్ర‌వారం ఉద‌యం 10.08 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పింది. ఇక పూర్తి పాట‌ను డిసెంబ‌ర్ 14 వ తేదీన అంటే శ‌నివారం విడుల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

Amardeep-Supritha : అమ‌ర్‌దీప్‌-సుప్రీత సినిమాకు టైటిల్‌ పెట్టే ఛాన్స్‌.. ఎలాగో తెలుసా?

త‌మ‌న్ సంగీతాన్ని అందించిన ఈ పాట ఏ రేంజ్‌లో ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.