Pushpa 2 Collections : ‘పుష్ప 2’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా? ఆల్ టైమ్ రికార్డ్‌..

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మూవీ పుష్ప 2.

Pushpa 2 Collections : ‘పుష్ప 2’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా? ఆల్ టైమ్ రికార్డ్‌..

Allu Arjun Pushpa 2 Seven Days Collections here

Updated On : December 12, 2024 / 9:42 PM IST

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మూవీ పుష్ప 2. బ‌న్నీ న‌ట విశ్వ‌రూపం చూపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. రికార్డు క‌లెక్ష‌న్స్‌లో దూసుకుపోతుంది. భాష‌ల‌తో సంబంధం లేకుండా విడుద‌లైన ప్ర‌తీ చోటా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి వారం స‌క్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది.

ఏడు రోజుల్లో ఈ చిత్రం రూ.1067 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలో తొలి వారంలో అత్య‌ధిక గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది.

Sambarala Yeti Gattu : సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా టైటిల్ ‘సంబ‌రాల ఏటిగ‌ట్టు’.. అదిరిపోయిన గ్లింప్స్‌..

దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వారం రోజుల్లోనే ఎన్నో రికార్డుల‌ను బ్రేక్ చేసిన పుష్ప‌2 మూవీ.. రానున్న రోజుల్లో మ‌రెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందోన‌ని అంటున్నారు.

Vere Level Office : ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘వేరే లెవల్‌ ఆఫీస్‌’.. నువ్వులే న‌వ్వులు..

ఈ చిత్రంలో రష్మిక క‌థానాయిక‌. పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కింది ఈ చిత్రం. అన‌సూయ‌, ఫ‌హాద్ ఫాజిల్‌, సునీల్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్ లు నిర్మించారు.