Pooja Hegde: నేను దానికోసమే ఇండస్ట్రీలోకి రాలేదు.. పూజా హాట్ కామెంట్స్!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అమ్మడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. పూజా నటించిన తాజా బాలీవుడ్ మూవీ ‘సర్కస్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తుండటంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లుగా గతకొద్ది రోజులు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

Pooja Hegde Comments On Remuneration Hike

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అమ్మడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. పూజా నటించిన తాజా బాలీవుడ్ మూవీ ‘సర్కస్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తుండటంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లుగా గతకొద్ది రోజులు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

Pooja Hegde: అందాల పరువాలతో మాయ చేస్తున్న పూజా హెగ్డే

అయితే ఈ వార్తలపై తాజాగా పూజా రెస్పాండ్ అయ్యింది. తాను సినిమా ఇండస్ట్రీకి కేవలం డబ్బుల కోసమే రాలేదని.. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని.. అందుకే తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఈ రంగంలోకి వచ్చినట్లుగా పూజా చెప్పుకొచ్చింది. ఇక తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. తాను చాలా రోజులుగా రెమ్యునరేషన్‌ను పెంచలేదని.. నిర్మాతలను తన రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టడం తనకు నచ్చదని ఆమె చెప్పుకొచ్చింది.

Pooja Hegde: ఇంకా కోలుకొని బుట్టబొమ్మ.. చికిత్స పొందుతున్న పూజ హెగ్దే!

అంతేగాక, తాను ఓ ప్రాజెక్ట్ ఓకే చేయాలంటే ముందుగా తనకు కథ నచ్చాలని.. ఆ తరువాతే రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతానని పూజా కామెంట్ చేసింది. ఇలా తనపై కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతుండటం బాధాకరమని ఆమె తెలిపింది. ఏదేమైనా పూజా హెగ్డే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు పూజా చెక్ పెట్టేసిందని ఆమె అభిమానులు అంటున్నారు.