Pooja Hegde: ఇంకా కోలుకొని బుట్టబొమ్మ.. చికిత్స పొందుతున్న పూజ హెగ్దే!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే ప్రస్తుతం అనారోగ్యంతో బెడ్ పై ఉంది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాట లేకపోతున్నాయి. ఇటువంటి సమయంలో పూజ హెగ్దే సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇటీవల షూటింగ్ సమయంలో ఆమె కాలుకి గాయం అవ్వడంతో ఆమె ట్రీట్మెంట్ బెడ్ కి పరిమితం కావాల్సి వచ్చింది. అక్టోబర్ నెలలు ఆమెకు గాయం బెడ్ పై ఉన్నట్లు అభిమానులకు తెలియజేసింది. తాజాగా నేడు..

Pooja Hegde is Still on Treatment Bed
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే ప్రస్తుతం అనారోగ్యంతో బెడ్ పై ఉంది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాట లేకపోతున్నాయి. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ సినిమాలు అనుకున్న విజయాన్ని అందుకోవడంలో మాత్రం తడబడ్డాయి. ప్రస్తుతం ఈ అమ్మడి కెరీర్, తరువాత రాబోయే చిత్రాలు ఫలితంపై ఆధారపడి ఉంది.
Jodo Yatra in Actor Pooja Bhatt : రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజా భట్
ఇటువంటి సమయంలో పూజ హెగ్దే సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇటీవల షూటింగ్ సమయంలో ఆమె కాలుకి గాయం అవ్వడంతో ఆమె ట్రీట్మెంట్ బెడ్ కి పరిమితం కావాల్సి వచ్చింది. అక్టోబర్ నెలలు ఆమెకు గాయం బెడ్ పై ఉన్నట్లు అభిమానులకు తెలియజేసింది. ఆ తరువాత దీవాళీ సమయంలో ఈ హీరోయిన్ కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఆమె కోలుకుందని బావించారందరు. అయితే తాజాగా నేడు మరో ఫోటోను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
వాకింగ్ స్టాండ్ తో ఉన్న పూజ ఫోటో చూస్తే ఆమె ఇంకా కోలుకోలేదని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ బాలీవుడ్ లో రన్ వీర్ సింగ్ ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్’ నటిస్తుండగా, తెలుగులో మహేష్ బాబు సరసన ‘SSMB28’లో నటిస్తుంది. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తీ చేసుకుంది.