Pooja Hegde : కొత్త ఇంట్లో పూజా.. నా కల నెరవేరింది అంటూ..

పూజా హెగ్డే  చాలా పద్దతిగా మెరిసిపోతున్న పంజాబీ డ్రెస్ వేసుకొని కొబ్బరికాయ పట్టుకొని దండం పెట్టుకునే ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోతో పాటు.. ''ఒక సంవత్సరం.....

Pooja Hegde : కొత్త ఇంట్లో పూజా.. నా కల నెరవేరింది అంటూ..

Pooja Hegde

Updated On : January 23, 2022 / 6:51 AM IST

Pooja Hegde :  ప్రస్తుతం పూజా హెగ్డే వరుస హిట్స్ తో చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది. హిట్ సినిమాలు పడటంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసింది బుట్టబొమ్మ. గతంలో తాను ముంబై లో ఇల్లు కట్టబోతున్నట్టు కూడా తెలిపింది. తాజాగా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసింది పూజా. ఈ మేరకు పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫొటో పెట్టి పోస్ట్‌ చేసింది.

Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నుంచి మరో సిరీస్.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ప్రాజెక్టు

పూజా హెగ్డే  చాలా పద్దతిగా మెరిసిపోతున్న పంజాబీ డ్రెస్ వేసుకొని కొబ్బరికాయ పట్టుకొని దండం పెట్టుకునే ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోతో పాటు.. ” ఒక సంవత్సరం ముందు ఇదే రోజు మొదలుపెట్టిన ఇల్లు కట్టుకోవాలన్న నా కల నెరవేరింది. మీరు మీ అంతరాత్మను, శ్రమను నమ్ముతూ ఉండండి. ఈ ప్రపంచమే మీతో ప్రేమలో పడుతుంది” అని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)