Pooja Hegde reportedly slapped a star hero.
Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజ హెగ్డే సంచలన కామెంట్స్ చేసింది. తనతో ఒక హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, లాగిపెట్టి కొట్టానని చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే తన కెరీర్ బిగినింగ్ లో జరిగిన చేదు అనుభవాలను ఆడియన్స్ తో పంచుకుంది. ఆ సమయంలో తనకు వచ్చిన ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు చాలా హ్యాపీగా ఒకే చేసిందట. పాన్ ఇండియా స్టార్ హీరోగా తో సినిమా అవడంతో ఆనందంతో గంతులు వేసిందట.
ఈ విషయం గురించి పూజ హెగ్డే(Pooja Hegde) మాట్లాడుతూ.. ‘నా కెరీర్ బిగినింగ్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చింది. చాలా హ్యాపీ ఫీలయ్యాను. కానీ, ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక చేదు సంఘటన ఎదురయ్యింది. నా అనుమతి లేకుండా ఆ హీరో నా క్యారవాన్ లోకి వచ్చాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు.
Meenakshi Chaudhary: మీనాక్షి గ్లామర్ ట్రీట్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
సహనం కోల్పోయిన నేను ఆ హీరోని లాగిపెట్టి కొట్టాను. వెంటనే, వ్యాన్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నేను ఆ హీరోతో చేయడానికి ఇష్టపడలేదు. నా సీన్స్ ని డూపుని పెట్టి తీశారు’ అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. దీంతో పూజ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, తనతో మిస్ బిహేవ్ చేసిన ఈ హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు పూజ.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పూజ హెగ్డే తలపతి విజయ్ తో జన నాయగన్ సినిమా చేస్తోంది. విజయ్ చివరి సినిమాగా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ నుంచి వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు.