Pooja Hegde
Pooja Hegde: నాకు నేనే స్టార్.. పెద్ద కో స్టార్ అవసరం లేదంటుంది బుట్టబొమ్మ. ప్రభాస్, బన్నీ, సల్మాన్, రణ్ వీర్.. ఇలా హీరో ఎవరన్నది ముఖ్యం కాదని తేల్చేసింది. స్టార్ హీరోలతో నటించి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది? హీరో కానే కాదు డైరెక్టర్ తో పాటూ స్క్రిప్ట్ కే తన ఓట్ అనడంలో అర్ధమేంటి?
Pooja Hegde : ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జంటగా పూజాహెగ్డే, నాగ చైతన్య ?
హీరోలతో తనకు పనిలేదంటోంది పూజా హెగ్డే. కథ, డైరెక్టర్ మాత్రమే ముఖ్యమనేది బుట్టబొమ్మ వెర్షన్. ఆల్రెడీ తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన పూజా… వన్స్ మోర్ అన్న రేంజ్ లో మరోసారి మహేశ్ లాంటి స్టార్స్ తో జోడీ కడుతోంది. అటు బాలీవుడ్ లో సల్మాన్, రణ్ వీర్… కోలీవుడ్ లో దళపతి విజయ్… ఇలా పూజా నటించే సినిమాలన్నీ స్టార్ హీరోలవే. కానీ తనకు హీరో… ఆ హీరో స్టేటస్ కాదు… స్క్రిప్ట్, డైరెక్టర్ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది.
Pooja Hegde: టాలీవుడ్ టూ బాలీవుడ్.. కెరీర్ బెస్ట్ టైమ్ ఎంజాయ్ చేస్తోన్న బుట్టబొమ్మ!
హీరోలని చూసి సైన్ చేసే పోజిషన్ లో తాను లేనన్నట్టు మాట్లాడుతోంది బుట్టబొమ్మ. ప్రస్తుతం మంచి స్క్రిప్ట్ ని లేదంటే చిన్న స్టోరీతోనైనా స్క్రీన్ పై మ్యాజిక్ చేయగల డైరెక్టర్స్ నే ఆమె నమ్ముతోంది. అందుకే రాజమౌళి, రాజకుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దర్శకులు పిలిస్తే… కథ అడగనని చెప్పిన పూజా… రోహిత్ శెట్టి మీద నమ్మకంతో సర్కస్ ను అలాగే ఒప్పుకున్నానంది. ఏదేమైనా స్టార్ హీరోల సినిమాలతో పేరుతెచ్చుకుని… ప్రస్తుతం కూడా పెద్ద హీరోలతోనే నటిస్తున్నఈ గ్లామర్ డాల్… నాకు నేనే స్టార్.. నాకొద్దు పెద్ద కో స్టార్ అనడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.