Pooja Ramachandran : తల్లి అయిన ప్రముఖ నటి.. హాస్పిటల్ బెడ్ మీద నుంచే పోస్ట్..

కొన్ని నెలల క్రితం పూజా తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే తన భర్త జాన్ కొక్కెన్ తో కలిసి సముద్రపు ఒడ్డున బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేసింది.

Pooja Ramachandran gave a birth to baby boy

Pooja Ramachandran : తెలుగులో స్వామి రారా సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది నటి పూజా రామచంద్రన్. ఆ సినిమా సక్సెస్ తో తెలుగు, తమిళ్ లో మంచి అవకాశాలు సంపాదించింది పూజా. తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే తెలుగు బిగ్ బాస్ లో కూడా పాల్గొంది పూజా రామచంద్రన్. దీంతో తెలుగులో మరింత పాపులారిటీ తెచ్చుకుంది పూజా. 2019 లో జాన్ కొక్కెన్ అనే నటుడ్ని పూజా ప్రేమించి పెళ్లి చేసుకుంది. జాన్ కొక్కెన్ పలు తమిళ్, తెలుగు సినిమాల్లో విలన్ గా నటించాడు.

గత రెండేళ్లుగా పూజా సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం పూజా తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే తన భర్త జాన్ కొక్కెన్ తో కలిసి సముద్రపు ఒడ్డున బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Chola Vs Pandya : PS 2 సినిమాతో తమిళనాడులో చోళ వర్సెస్ పాండ్య రచ్చ.. పాండ్య వారసులం అంటూ ఐశ్వర్య రాయ్ ఫొటోతో పోస్టర్స్..

తాజాగా శనివారం ఏప్రిల్ 29న రాత్రి తమకు బాబు పుట్టాడని పూజా – జాన్ దంపతులు తెలిపారు. హాస్పిటల్ బెడ్ మీద నుంచే పూజా, జాన్ తమ బాబు చేయిని పట్టుకున్న ఓ ఫోటోని పోస్ట్ చేసి.. ఇదిగో మా చిన్ని బాబు వచ్చేశాడు. మా జీవితంలో సంతోషం నింపడానికి. మా అబ్బాయి కియాన్ కొక్కెన్ కి ప్రపంచంలోకి స్వాగతం అని పోస్ట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు పూజా రామచంద్రన్ కు, జాన్ కొక్కెన్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.