Poonam Kaur viral comments on sonu sood about prestigious award
Poonam Kaur : టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు. సినిమా నుంచి పొలిటికల్ వరకు ప్రతి విషయం పై హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పద్మ అవార్డుల ప్రకటన పై ఇన్‌డైరెక్ట్ గా రియాక్ట్ అవుతూ.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ గణతంత్ర దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి మన మెగాస్టార్ చిరంజీవిని కూడా ‘పద్మవిభూషణ్’ వరించింది. అయితే ఈ అవార్డు ప్రకటన తరువాత బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. కరోనా టైమ్‌లో సోనూసూద్ చేసిన సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి కూడా ఆయన ఆ సేవలను కొనసాగిస్తూనే వస్తున్నారు.
Also read : Kalki 2898 AD : కల్కి టీజర్ రిలీజ్‌కి భారీ ప్లాన్.. హాలీవుడ్ సినిమాల ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాట్‌ఫార్మ్‌పై..
అలాంటి వ్యక్తికి ‘పద్మ’ అవార్డు ఇచ్చి కేంద్రం గౌరవించాల్సింది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఈ విషయం గురించి మాట్లాడారు. ఇక తాజాగా పూనమ్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు.. “సోనూసూద్ కూడా ఆ ప్రెస్టీజియస్ అవార్డుకి అర్హులు. కరోనా టైములో ఆయన చేసిన సేవ అసామాన్యం. అయితే ఆయనకి ఏ రాజకీయ నాయకుడిని కాకాపట్టడం తెలియదు కదా” అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో చాలామంది ఈ విషయం పైనే మాట్లాడుతూ.. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడాన్ని తప్పుబట్టడం లేదు. ఆయన ఎన్నో సేవలు చేశారు. కరోనా టైములో ఆయన కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టి సహాయం అందించారు. ఆయనతో పాటు సోనూసూద్ కి కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్నారు.