Kalki 2898 AD : కల్కి టీజర్ రిలీజ్‌కి భారీ ప్లాన్.. హాలీవుడ్ సినిమాల ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాట్‌ఫార్మ్‌పై..

కల్కి టీజర్ రిలీజ్‌కి భారీ ప్లాన్ వేస్తున్న మూవీ టీం. హాలీవుడ్ సినిమాల ట్రైలర్ రిలీజ్ చేసే 'ది సూపర్ బౌల్' ఈవెంట్‌లో..

Kalki 2898 AD : కల్కి టీజర్ రిలీజ్‌కి భారీ ప్లాన్.. హాలీవుడ్ సినిమాల ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాట్‌ఫార్మ్‌పై..

Prabhas Kalki 2898 AD teaser will be released on The SUPERBOWL event

Updated On : January 28, 2024 / 6:00 PM IST

Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకుంది. మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టబోతుందట. ఈక్రమంలోనే మొదటిగా టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక ఈ టీజర్ ని రిలీజ్ చేయడానికి భారీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో అత్యధిక పాల్గొనే ‘ది సూపర్ బౌల్’ ఈవెంట్ లో ఈ టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Also read : HanuMan : అయోధ్య గుడికి మాత్రమే కాదు.. భద్రాచలంతో పాటు మరికొన్ని రామమందిరాలకు విరాళాలు..

గతంలో అక్కడ డెడ్ పూల్ 3, జోకర్ 2, గాడ్జిల్లా, డూన్ 2 గ్లింప్స్ అండ్ ట్రైలర్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు కల్కి టీజర్ ని కూడా అక్కడ రిలీజ్ చేయబోతున్నారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే.. మూవీ టీం నుంచి ఓ క్లారిటీ రావాల్సిందే. కాగా ఈ మూవీ గ్లింప్స్ ని కూడా హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తే దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.