Poorvaj and Jyothi Poorvaj Killer Movie Poorvaj First Look Released
Killer : శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్.. లాంటి పలు డిఫరెంట్ సినిమాలతో దర్శకుడు పూర్వాజ్ వరుసగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పూర్వాజ్ ‘కిల్లర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఆమె ఫస్ట్ లుక్ ని గతంలో రిలీజ్ చేసారు. రోబోటిక్ తో పాటు క్రైం, యాక్షన్ ఈ సినిమాలో ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Game Changer : ఊహించని ప్లేస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు
అయితే ఈ సినిమాలో దర్శకుడు పూర్వాజ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. తాజాగా పూర్వాజ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ లుక్ లో పూర్వాజ్ చేతిలో రివాల్వర్ తో సీరియస్ గా కనిపిస్తున్నారు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మాణంలో పూర్వాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా పార్ట్ 1 అవ్వగా రెండో పార్ట్ కూడా అంటుందని సమాచారం.