Posani Krishna Murali good bye to Politics
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇక మీద తాను రాజకీయాల గురించి మాట్లానని చెప్పారు. తాను ఏ పార్టీని పొగడను అని, మరే పార్టీని విమర్శించను ఏ పార్టీని సపోర్టు చేయనని అని తెలిపారు. తనను ఎవరూ ఏమీ అనలేదన్నారు.
తాను ఎప్పుడు మంచి రాజకీయ నాయకులను విమర్శలు చేయలేదన్నారు. తనకు నరేంద్ర మోదీ 35 ఏళ్లుగా తెలుసునని, ఆయన్ను ఎప్పుడు విమర్శించలేదన్నారు. ఇందిరా గాంధీ, నవీన్ పట్నాయక్ వంటి వారిని విమర్శించలేదన్నారు. తాను అన్ని పార్టీలకు సపోర్టు చేశానని, అలాగే విమర్శలు చేశానని ఆయా పార్టీల్లోని నాయకుల గుణగణాల బట్టి మాత్రమేనని అన్నారు.
Amaran : అమరన్ టీమ్ కి షాక్.. కోటి నష్టపరిహారం కట్టాలంటూ..
తాను అందరి కంటే ఎక్కువగా పొగిడింది చంద్రబాబు నాయుడినేని అన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనులను ఓ లిస్ట్ కూడా రాసుకున్నానని చెప్పారు. ఆయన పొరపాట్లు చేసినప్పుడు విమర్శలు చేశానన్నారు. ఇక నుంచి తన చివరి శ్వాస వరకు కుంటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి చెప్పారు.
పవన్‌తో సినిమా చేస్తా..
తాను రైటర్‌ను, డైరెక్టర్‌ను, ఆర్టిస్ట్‌నని చెప్పారు. తనకు ఎవరిపై కోపం ఉండదన్నారు. ఎవరైనా సరే వేషం ఇస్తారని చెబితే చేస్తానని అన్నారు. లేదంటే తానే సినిమాలు తీస్తానని అన్నారు. పవన్ సినిమాలో వేషం వచ్చినా, చిరంజీవి మూవీలో వేషం వచ్చినా నటిస్తానని అన్నారు.
Pushpa 2 Song : పుష్ప ఐటెం సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. శ్రీలీల ‘కిస్సిక్’ సాంగ్..