Amaran : అమరన్ టీమ్ కి షాక్.. కోటి నష్టపరిహారం కట్టాలంటూ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా అమరన్.

An engineering student who gave a huge shock to the Amaran movie team asking for a compensation of Rs 1 CR
Amaran : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా అమరన్. మేజర్ ముకుందరాజన్ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇందులో మేజర్ ముకుందన్ గా శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబెకా వర్గిస్ గా సాయి పల్లవి నటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబటింది.
అయితే తాజాగా ఈ మూవీ టీమ్ కి విగ్నేషన్ అనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి నోటీస్ పంపుతూ.. కోటి రూపాలు నష్ట పరిహారం కట్టాలని డిమాండ్ చేసాడు. అసలేం జరిగిందంటే.. అమరన్ సినిమాలో ఓ సీన్ లో సాయి పల్లవి హీరో శివ కార్తికేయన్ ఇద్దరూ ప్రేమలో పడ్డ సమయంలో సాయి పల్లవి హీరోకి తన ఫోన్ నంబర్ ఓ కాగితం పై రాసి.. ఫోన్ చెయ్యమని ఇస్తుంది. ఇక దీనికోసం ఈ ఫోన్ నంబర్ వాడారు మూవీ టీమ్. అయితే మూవీ టీమ్ వాడిన ఆ నంబర్ ఓ ఇంజనీరింగ్ కుర్రాడిదట. ఇక సినిమా అనంతరం సాయి పల్లవి నంబర్ అదే అని చాలా మంది ఆకతాయిలు ఆ నంబర్ కి వరుసగా కాల్స్ చేస్తున్నారట. ఇలా తీరిక లేకుండా వరుస ఫోన్ కాల్స్ రావడంతో ఆ అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడట. అందుకే అమరన్ మూవీ టీమ్ కి కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ నోటిస్ పంపాడట.
Also Read : Jakes Bejoy : ఒకేసారి మూడు భాషల్లో మూడు సినిమాలు.. సరిపోదా శనివారం మ్యూజిక్ డైరెక్టర్ హవా
ఇక అందులో.. ఇలా వరుస ఫోన్ కాల్స్ రావడంతో తను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని, కనీసం తన ఫ్యామిలీ తో కూడా ఉండలేకపోతున్నాని, తన అనుమతి లేకుండా తన ఫోన్ నంబర్ అమరన్ సినిమాలో వాడుకున్నందుకు తనకి నష్టపరిహారం చెల్లించాల్సిందే అని పేర్కొన్నాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.