Bheela Nayak: పవన్ ఫీవర్.. ఇక్కడా.. అక్కడా.. ఎక్కడైనా భీమ్లాదే హవా!
భీమ్లా భీమ్ల భీమ్లా.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కామన్ ఆడియెన్స్ వరకు ఇప్పుడెవరిదగ్గరైనా ఒకటే మ్యాటర్. అదీ భీమ్లానాయక్ స్ట్రేచర్. అంతలా పవర్ స్టార్ మేనియా నడుస్తుందిప్పుడు.
- Naresh Mannam
- Published On : February 22, 2022 / 09:06 PM IST
Bheemla Nayak
Bheela Nayak: భీమ్లా భీమ్ల భీమ్లా.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కామన్ ఆడియెన్స్ వరకు ఇప్పుడెవరిదగ్గరైనా ఒకటే మ్యాటర్. అదీ భీమ్లానాయక్ స్ట్రేచర్. అంతలా పవర్ స్టార్ మేనియా నడుస్తుందిప్పుడు. ట్రైలర్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తోన్న ఫ్యాన్స్ సినిమా కోసం వెయిటింగ్ ఇక్కడా అంటున్నారు. అటు ఫ్యాన్స్ ను మరింత ఎగ్జైట్ చేసేలా ప్రీరిలీజ్ ఈవెంట్ ను రీషెడ్యూల్ చేశారు మేకర్స్.
Bheemla Nayak: థియేటర్స్‌పై భీమ్లా దండయాత్ర.. కలెక్షన్ల సునామీ ఖాయం?
వ్యూస్, లైక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు భీమ్లానాయక్. రీసెంట్ గా బయటికొచ్చిన భీమ్లానాయక్ ట్రైలర్.. ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఊపేస్తోంది. పవన్, రానా పవర్ఫుల్ ఫైట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చి భీమ్లాపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. రానా డైలాగ్ చెప్పినట్టు వెయింటింగ్ ఇక్కడా అంటూ నిజంగానే అభిమానులు రెచ్చిపోతున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకు పవర్ స్టార్ ఫీవర్ పట్టుకుంది. ఆ జ్వరం పవన్ బొమ్మ థియేటర్ లో పడితేగానీ వదిలేలా లేదు.
Bheemla Nayak : తమన్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. అన్నీ థియేటర్లోనే అంటున్న తమన్
సోమవారం జరగాల్సిన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని బుధవారం గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో స్టేజ్ కి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్న పవర్ స్టార్ ఫంక్షన్ లో.. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్.
Bheemla Nayak: ‘నేను ఇవతల ఉంటే చట్టం.. అవతలికొస్తే కష్టం.. వాడికి’
పవన్ కల్యాణ్ తో పోటీకి దిగకుండా తెలుగు హీరోలందరూ పక్కకు తప్పుకున్నారు. కానీ అజిత్ వలిమై, అలియా గంగూభాయ్ ఇక్కడ రిలీజ్ కాబోతున్నా.. వాటికంత బజ్ క్రియేట్ కావట్లేదు. పాటిటివ్ టాక్ తెచ్చుకుంటే కథ మారుతుందేమో చూడాలి. ఇక ఒక్క హైదరబాద్ సిటీలోనే అడ్వాన్స్ బుకింగ్ 1క్రోర్ మార్క్ ను దాటేసింది భీమ్లా. అటు అంచనాలకు అందకుండా ఓవర్సీస్ ప్రీ బుకింగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఇలా మొత్తానికి పవన్ కల్యాణ్ కటౌట్స్ తో థియేటర్ బయట సందడి మొదలైతే.. థియేటర్ లోపల ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు బుకింగ్ స్పీడ్ పెంచేస్తున్నారు ఫ్యాన్స్.
