OG Success Meet
OG Success Meet : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ సినిమా విజయంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముందు నుంచి ఈ సినిమాకు ఉన్న హైప్, పవన్ కళ్యాణ్ స్టిల్స్, సినిమాలో పవన్ లుక్స్, సాంగ్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇచ్చాయి.(OG Success Meet)
కొన్నేళ్ల తర్వాత పవన్ పెద్ద హిట్ కొట్టడంతో పాటు టాలీవుడ్ కూడా OG సినిమాని సెలబ్రేట్ చేయడం స్పెషల్ గా మారింది. ఇప్పటికే OG సినిమా 270 కోట్లకు పైగా వసూలు చేసి 300 కోట్లకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఉన్నాయని సుజీత్ చెప్పడం, పవన్ కూడా OG యూనివర్స్ ఉందని చెప్పడంతో పవన్ మళ్ళీ సినిమాలు చేస్తారని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read : Special Song : OG స్పెషల్ సాంగ్ యాడ్ చేసార్రోయ్.. నేహాశెట్టి కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్..
OG బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నేడు అక్టోబర్ 1న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ లో ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. కేవలం మీడియా సమక్షంలో మాత్రమే, తక్కువ మంది మధ్యలోనే ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. అలాగే నిర్మాత దానయ్య, డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ రవి చంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్.. సినిమాలో నటించిన మరికొంతమంది కూడా ఈ సక్సెస్ మీట్ కి హాజరు కానున్నారు.
దీంతో పవన్ ఈ సక్సెస్ మీట్ లో ఏం మాట్లాడతాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్ కి ఇమ్రాన్ హష్మీ వస్తాడా రాడా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. రేపు అక్టోబర్ 2 దసరా పండగ కాగా ఫ్యాన్స్ కి పవన్ ఒక రోజు ముందే ట్రీట్ ఇస్తున్నాడు.
Also Read : Pawan Kalyan : మెగా షో తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్స్.. OG యూనివర్స్ ఉంది.. వీడియో వైరల్..