Pawan Kalyan: పవర్ ట్రీట్.. పవన్ బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్
బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ తో పవర్ స్టార్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. భీమ్లానాయక్ గా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చిన పవన్... ప్రస్తుతం టార్గెట్ హరిహర వీరమల్లు అంటున్నారు. ఆ తర్వాత..
- Naresh Mannam
- Published On : March 10, 2022 / 11:15 AM IST
Pawan Kalyan
Pawan Kalyan: బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ తో పవర్ స్టార్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. భీమ్లానాయక్ గా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చిన పవన్… ప్రస్తుతం టార్గెట్ హరిహర వీరమల్లు అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాని లైన్ లో పెట్టారు. కానీ ఈలోపే మరో రెండు ప్రాజెక్ట్ లను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఆ రెండు కూడా రీమేక్సే కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Pawan Kalyan: నిజమా కదా.. భీమ్లా బ్యాచ్‌తోనే పవర్ మరో రీమేక్?
2022లో ఫస్ట్ మెగా హిట్ గా నిలిచింది భీమ్లానాయక్. వన్ మ్యాన్ ఆర్మీగా పవన్ భీమ్లానాయక్ ను వంద కోట్ల క్లబ్ లో చాలా ఈజీగా చేర్చేసారు. ఇప్పుడిక ఫోకస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టారు. క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది పవన్ ఫస్ట్ ప్రియారిటీ. ఆపై లైన్ లో హరీశ్ శంకర్ భవదీయుడు… భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఉన్నా… పవర్ స్టార్ మాత్రం మరో రెండు రీమేక్స్ పై కాన్సంట్రేట్ చేస్తున్నారు.
Pawan Kalyan : ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’
మలయాళీ హిట్ అయప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా వచ్చి బంపర్ హిట్ అనిపించుకుంది భీమ్లానాయక్. ఈ సక్సెస్ లో డైరెక్టర్ సాగర్ చంద్రతో పాటూ మేజర్ పార్ట్ త్రివిక్రమ్ దే. అందుకే పవన్ కు మరో హిట్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ వినోదయ సిత్తం రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారు. మల్టీస్టారర్ గా తెరకెక్కబోయే ఈ మూవీలో పవన్ తో పాటూ సాయిధరమ్ తేజ్ లేదంటే వైష్ణవ్ తేజ్ నటించే అవకాశముంది. ఈ సినిమా కూడా భీమ్లానాయక్ బ్యానర్ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ లోనే ఉండబోతుంది.
Pawan Kalyan : ‘గాడ్ ఫాదర్’తో ‘భీమ్లా నాయక్’.. ఒకరికోసం ఒకరు
పవర్ స్టార్ లిస్ట్ లో మరో రీమేక్ విక్రమ్ వేదా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోయే ఈ మూవీలో పవన్ కల్యాణ్ తో పాటూ మాస్ రాజా రవితేజను సెట్ చేసే ఛాన్స్ ఉంది. రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటికే తమిళ్ మాసివ్ హిట్ విక్రమ్ వేదాను హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కాంబోలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో పవన్, రవితేజ కాంబినేషన్ అంటే సెన్సేషన్ అవడం ఖాయం. బాబీ మూవీ కోసం ఆల్రెడీ అన్నయ్య చిరూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ రాజా… ఇప్పుడిక తమ్ముడు పవన్ తో కలిస్తే అరుపులే అంటున్నారు ఫ్యాన్స్.
