Pawan Kalyan : ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’

పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇది మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్.

Pawan Kalyan : ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’

Ayyapanum Koshiyam

Bheemla Nayak :  వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలు చాలా తెలుగులో రీమేక్ అవుతుంటాయి. ఇక పవన్ కళ్యాణ్ చాలా వరకు రీమేక్ సినిమాలు చేశారు. వాటితో విజయం కూడా సాధించారు. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇది మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్.

అయితే చాలా రీమేక్ సినిమాలకి తెలుగులో కథని, కథనంని మార్చేస్తారు. ఇక పవన్ సినిమాలకి అయితే కచ్చితంగా మార్చాల్సిందే. గతంలో వచ్చిన చాలా సినిమాలకి కూడా ఇదే జరిగింది. పవన్ స్టార్ డంని దృష్టిలో పెట్టుకొని సినిమాలో కావాలని యాక్షన్ సన్నివేశాలని, ఎలివేషన్ సీన్స్ లని జొప్పిస్తారు. ఇలాంటి వాటి వల్ల సినిమాకి హైప్ వచ్చినా, సినిమా హిట్ అయినా సినీ ప్రేమికుల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తుంది. గతంలో ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో పాటు అంతకు ముందు వచ్చిన రీమేక్ సినిమాలలోనూ కూడా ఇదే జరిగింది. తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

Bheemla Nayak : పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ అభిమానుల సెగ

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాకి ఉన్న వ్యత్యాసలేంటో చూదాం…..

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది. ‘భీమ్లా నాయక్’లో ఆ స్లో నెరేషన్ తీసేసారు. అందులో హీరోలిద్దరికి సమ ప్రాధాన్యత ఉంటుంది. కాస్త కోషి క్యారెక్టర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్యారెక్టర్ తెలుగులో రానా చేశారు. ఆటోమేటిక్ గా పవన్ ని హైప్ చేయాలి కాబట్టి రానాకి ప్రాధాన్యం తగ్గింది అంటున్నారు. కానీ రానా తన నటనతో అదరకొట్టేసాడు. ఇక టైటిల్ లో మలయాళం సినిమాలో ఇద్దరి క్యారెక్టర్స్ వచ్చేలా పెడితే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు మాత్రమే సినిమా టైటిల్ లా పెట్టారు. మలయాళ మాతృకలో బ్రహ్మానందం క్యారెక్టర్ లేదు. తెలుగులో ఆ క్యారెక్టర్‌ను జోడించారు. మలయాళంలో నాలుగు పాటలు ఉంటే తెలుగులో డీజే వర్షన్‌తో కలిపి ఐదు పాటలున్నాయి. ఇలా పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని చాలా మార్చారు. పవన్ క్రేజ్ తో సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. బెనిఫిట్ షో నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఒరిజినల్ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తే ఇంకెన్ని మార్పులు చేర్పులు చేశారో తెలుస్తుంది.

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ కి, రానాకి సెలబ్రిటీల విషెస్..

ఒరిజినల్ వర్షన్ కి, భీమ్లా నాయక్ కి చాలా తేడాలు ఉన్నాయి. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. భీమ్లా నాయక్ రాకముందే ఓటీటీ ద్వారా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాని చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూసేశారు. వారికి భీమ్లా నాయక్ మొత్తం డిఫరెంట్ గా అనిపిస్తుంది. కాని మలయాళం సినిమా చూడకుండా ‘భీమ్లా నాయక్’ వెళ్లిన వాళ్లకి మాత్రం కచ్చితంగా సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు భీమ్లా నాయక్ అదిరిపోయిందని చెప్తున్నారు. అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ వినిపిస్తుంది.