Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu: ఇప్పుడు మన సినిమాలే కాదు.. సినిమా ప్రమోషన్ కూడా మారింది. కొత్త పంథాలో మేకర్స్ ప్రచారాన్ని చేస్తూ విడుదలకు ముందే సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొన్నటి వరకు హీరోలు, హీరోయిన్స్ పుట్టినరోజులు వంటి ఫ్యాన్స్ అకేషన్స్ కోసం ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్స్ విడుదల చేస్తుండగా ఇప్పుడు మేకింగ్ వీడియోలు, స్పెషల్ ప్రమోషనల్ వీడియోలు కూడా రూపొందించి విడుదల చేస్తున్నారు. తాజాగా.. ఆర్ఆర్ఆర్ స్పెషల్ దోస్తీ వీడియో సాంగ్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదన్నా సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ అభిమానులకు పండగ తెచ్చే న్యూస్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఒకపక్క పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ పోస్టర్స్, లుక్ హల్చల్ చేస్తుండగా.. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా హంగామా మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా నుండి ఇప్పటికే పోస్టర్ భారీ హైప్ పెంచేయగా ఇప్పుడు ఏకంగా ఓ మేకింగ్ వీడియో తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు.. ఆ రోజు ఆయన అభిమానులకు పండుగరోజు. ఆ పండగను రెట్టింపు చేసేందుకు హరిహర వీరమల్లు నుండి మేకింగ్ వీడియో తీసుకురానున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా ప్రకటన లేనప్పటికీ మెగా సర్కిల్స్ లో భారీ ప్రచారం జరుగుతుంది. భీమ్లా నాయక్ నుండి ఆ రోజు ఎలాగూ ఏదోఒక సర్ప్రైజ్ ఉండడడం గ్యారంటీ. దీనికి తోడు హరిహర వీరమల్లు కూడా తోడైతే ఇక పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవేమో!