Prabhas Adipurush Pre Release Event conducted by HanuMan movie team
Adipurush Pre Release Event : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సందడి కనిపిస్తుంది. రామాయణం బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు (జూన్ 6) తిరుపతిలో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం అక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హనుమాన్ (HanuMan) మూవీ టీం నిర్వహించడం విశేషం.
Sumalatha : సుమలత కొడుకు పెళ్ళిలో పాన్ ఇండియా స్టార్స్ రజనీకాంత్, యశ్.. ఫోటోలు!
రామభక్తుడు హనుమాన్ కథాంశంతో ప్రశాంత వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా హనుమాన్ సినిమా తెరకెక్కుతుంది. ఆదిపురుష్ టీజర్ విషయంలో హనుమాన్ చిత్రాన్ని పోలుస్తూ చాలా ట్రోల్స్ ఎదురుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్ తో ఆదిపురుష్ టీం ఆడియన్స్ ని మెప్పించింది. ఆ ట్రైలర్ తో మూవీ పై పాజిటివ్ బుజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మూవీ పై మరింత క్యూరియాసిటీని కలగజేసేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రాముడి ఈవెంట్ భాద్యతలను హనుమాన్ టీంకి అప్పజెప్పారు.
Tillu Square : డీజే టిల్లు సౌండ్‌కి డేట్ షురూ.. పోస్టర్‌లో అనుపమతో సిద్దు రొమాన్స్!
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎఐ టెక్నాలజీతో తొలిసారి 50 అడుగుల ప్రభాస్ కట్ అవుట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భారీ అయోద్య సెట్ ని నిర్మిస్తున్నారు. ఎల్ ఈ డి లైట్స్ తో స్టేజిని సెట్ చేస్తున్నారు. ఇక తేజ సజ్జ ఈ ఈవెంట్ కి యాంకరింగ్ చేయబోతున్నాడు. తేజతో పాటు యాంకర్ ఝాన్సీ కూడా సందడి చేయబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆదిపురుష్ నుంచి సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.