Adipurush : వచ్చే సంక్రాంతికి ‘ఆదిపురుష్’.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. త్వరలో 'రాధేశ్యామ్' విడుదల కాబోతుంది. మిగిలిన సినిమాలు కూడా ఫాస్ట్ గా రెడీ చేసేస్తున్నాడు................

Adipurush : వచ్చే సంక్రాంతికి ‘ఆదిపురుష్’.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్

Adipurush

Updated On : March 1, 2022 / 10:18 AM IST

Adipurush :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. త్వరలో ‘రాధేశ్యామ్’ విడుదల కాబోతుంది. మిగిలిన సినిమాలు కూడా ఫాస్ట్ గా రెడీ చేసేస్తున్నాడు. తన పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణం ఆధారంగా తీసుకొని ‘ఆదిపురుష్’ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో కనిపించనున్నారు.

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించగా గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ వచ్చే సంక్రాంతి 2023 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)