Site icon 10TV Telugu

Kalki 2898AD : చిరంజీవి పుట్టిన రోజున ఓటీటీలో కల్కి సినిమా.. అధికారిక ప్రకటన..

Prabhas Amitabh Bachchan Kalki 2898AD Movie OTT Streaming Date Announced Full Details Here

Prabhas Amitabh Bachchan Kalki 2898AD Movie OTT Streaming Date Announced Full Details Here

Kalki 2898AD : : ఇటీవల ప్రభాస్ కల్కి సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్ హాసన్.. పలువురు ముఖ్య పాత్రల్లో చాలా మంది స్టార్స్ గెస్ట్ పాత్రల్లో కల్కి 2898AD సినిమా తెరకెక్కింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఆల్మోస్ట్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా ఏకంగా థియేటర్స్ లో 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

Also Read : Pawan Kalyan – Nidhhi Agerwal : పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్.. హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్..

జూన్ 27న కల్కి సినిమా థియేటర్స్ లో రిలీజవ్వగా ఇటీవలే 50 డేస్ సెలబ్రేషన్స్ కూడా సంధ్య థియేటర్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. కల్కి 2898AD సినిమా ఆగస్టు 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే కల్కి సినిమా రెండు ఓటీటీల్లోకి రానుంది. కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. రెండు ఓటీటీలోకి ఒకే రోజు రానుంది కల్కి సినిమా.

అయితే అదే రోజు చిరంజీవి పుట్టిన రోజు కావడం, చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం. థియేటర్స్ లో కల్కి సినిమా చూసిన వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోతున్నారు. ఓటీటీ కోసం నెట్ ఫ్లిక్స్ స్పెషల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.

Exit mobile version