Kantara Chapter 1: నిజమైన మాస్టర్ పీస్.. కాంతార: ఛాప్టర్ 1 సినిమాపై ప్రభాస్, సందీప్ ప్రశంసలు

కాంతార: ఛాప్టర్ 1(Kantara Chapter 1) సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. దసరా పండుగ కానుకగా అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది.

Kantara Chapter 1: నిజమైన మాస్టర్ పీస్.. కాంతార: ఛాప్టర్ 1 సినిమాపై ప్రభాస్, సందీప్ ప్రశంసలు

Prabhas and Sandeep Reddy Vanga praise Kantara Chapter 1

Updated On : October 3, 2025 / 12:46 PM IST

Kantara Chapter 1: కాంతార: ఛాప్టర్ 1 సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. దసరా పండుగ కానుకగా అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి, స్టార్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే, ఈ సినిమా గురించి మ్యాన్ అఫ్ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. సినిమా చాలా బాగుంది అంటూ ట్వీట్(Kantara Chapter 1) చేశాడు. తాజాగా ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా చేరారు.

Sagar: తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం.. హీరోగా సాగర్.. పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా

రిలీజ్ రోజే సినిమా చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంతార చాప్టర్‌1 గురించి మాట్లాడుతూ.. “కాంతార: చాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సినిమా చూడలేదు. ఇది సినిమాటిక్ ప్రభంజనం. స్వచ్ఛమైన భక్తి అంటే ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. ఈ సినిమా రిషబ్ శెట్టి వన్-మ్యాన్ షో. ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడు. ఇక కాంతార బీజీఎమ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే” అంటూ రాసుకొచ్చాడు.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “కాంతార: ఛాప్టర్ 1 అనేది ఒక బ్రిలియంట్ మూవీ. నటీనటుల ప్రతిభ చాలా బాగుంది. కాంతార1 ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అంటే రిషబ్ శెట్టి నటన. నిర్మత విజయ్ కిరగండూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంత భారీ విజయం సాధించిన చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది